పెన్‌గంగకు పోటెత్తిన వరద: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలకు ఇబ్బందులు

By narsimha lode  |  First Published Jul 23, 2023, 10:52 AM IST

భారీ వర్షాలతో  పెన్ గంగలో  వరద ఉధృతి పెరిగింది.  డోలారా బ్రిడ్జిని తాకుతూ  వరద ప్రవహిస్తోంది. దీంతో ఈ బ్రిడ్జిపై  ఒక్కో వాహనాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు.


ఆదిలాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్ గంగ ఉధృతితో డొలారా బ్రిడ్జిపై  భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.  దీంతో  44వ నెంబర్ జాతీయ రహదారిపై  వాహనాలు నిలిచిపోయాయి.  ఎగువన కురిసిన వర్షాలతో  పెన్ గంగకు  వరద పోటెత్తింది. డోలారా బ్రిడ్జిని తాకుతూ  వరద నీరు  ప్రవహిస్తుంది.  దీంతో ఇరువైపులా  వాహనాల రాకపోకల విషయంలో  అధికారులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరద  ఉధృతి తగ్గిన తర్వాతే  బ్రిడ్జిపై  వాహనాలను  అనుమతిని  ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి  బ్రిడ్జిపై  భారీ వాహనాలను అనుమతించడం లేదు.  

చిన్న వాహనాలను  ఒక్కోటి మాత్రమే  అనుమతిస్తున్నారు. దరిమిలా  44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు  నిలిచిపోయాయి. డోలారా బ్రిడ్జి మీదుగా తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు సాగుతాయి.  అయితే  ఈ బ్రిడ్జిని తాకుతూ  పెన్ గంగ ప్రవహించడంతో  చిన్న వాహనాలను మాత్రమే  బ్రిడ్జి మీదకు అనుమతిని ఇస్తున్నారు. పెన్ గంగ ఉధృతిని  జాతీయ రహదారి అధికారుల బృందం  ఆదివారం నాడు పరిశీలించింది.
 వరద ఉధృతిలోని వంతెన  పరిస్థితిని పరిశీలించారు పీడీ శ్రీనివాస్.వంతెనపై నుండి ఒక్కో వాహనాన్ని అనుమతిస్తున్నారు.  వంతెనకు ఇరువైపులా  25 కిలోమీటర్ల దూరం వాహనాలు బారులు తీరాయి.

Latest Videos

undefined

గత నాలుగైదు  రోజులుగా కురుస్తున్న వర్షాలు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు,ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. రానున్న రోజుల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. 

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా  ప్రవేశించాయి.  ఈ ఏడాది జూన్ మాసంలో  ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. ఈ నెలలో   నాలుగైదు రోజుల క్రితం వరకు  ఆశించిన వర్షాలు కురవలేదు. అయితే  నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు  సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి.  ఇంకా  రెండు మూడు రోజుల పాటు  వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.

click me!