హైదరాబాద్ ను భారీ వర్షం కుదిపేసింది. మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. పలు చోట్ల బుధవారం ఉదయం కూడా వర్షం పడుతుంది.
హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. ఐటీ కారిడార్ నుంచి కాప్రా, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, యూసఫ్ గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, క్రిష్ణానగర్, ఎల్వీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, రోడ్ల పక్కన తోపుడు బండ్ల వ్యాపారులు ఇళ్లకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు.
ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. 65వ నెంబర్ జాతీయ రహదారి మియాపూర్ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్, మలక్ పేట, ఎల్ బీ నగర్ వరకు వర్షం వల్ల వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం రాత్రి మొదలైన వర్షం.. బుధవారం రోజు కూడా హైదరాబాద్ లోని పలుచోట్లా కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. మరో వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్: పాతబస్తీలో ఎన్ఐఏ తనిఖీలు.. అదుపులో బీహార్ వాసి