కానిస్టేబుల్ మీద దాడి కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సహా ఐదుగురి మీద కేసు నమోదయ్యింది. దాడికి పాల్పడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది మీద సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్ : వైసీపీ ఎంపీ Raghuramakrishnam Raja నివాసం వద్ద జరిగిన రెక్కీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురామతో పాటు ఆయన భద్రతా సిబ్బంది చెబుతున్నారు. అయితే రోడ్డు పక్కన ఉన్న తనను కారులో బలవంతంగా తీసుకు వెళ్లి, దాడి చేశారని ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషా చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
ఈ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న కానిస్టేబుల్ ఫరూక్ భాషాను భద్రతా సిబ్బంది బలవంతంగా కారులో తీసుకు వెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ ఇద్దరు సీఆర్ పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకు భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ గంగారాంతోపాటు కానిస్టేబుల్ సందీప్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సందీప్, సిఆర్పిఎఫ్ ఏఎస్ ఐ గంగారాం, రఘు రామ పీఏ శాస్త్రిల మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
undefined
కానిస్టేబుల్ పై రఘురామ కృష్ణంరాజు కుటుంబసభ్యులు దాడి.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు..
ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని రఘురామపై ఆరోపణలు వచ్చాయి. రఘురామ కుమారుడు భరత్ తో పాటు ఆయన పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ వన్ గా రఘురామరాజు, ఏ2గా భరత్, ఏ3గా సందీప్ (సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్), ఏ4 ఏఎస్ఐ( సిఆర్పిఎఫ్),ఏ5 శాస్త్రి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కాగా జూలై 4న ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రఘురామ రాజు 3న సాయంత్రం నర్సాపురం ఎక్స్ప్రెస్లో భీమవరం వెళ్లేందుకు బయలుదేరారు. అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన రఘురామరాజు ప్రయాణాన్ని ముందుకు సాధించకుండానే బేగంపేటలో దిగిపోయారు తర్వాత ఆయన గచ్చిబౌలిలోని తన ఇంటికి వెళ్లిపోయారు.
అయితే రఘురామ ఇంటిదగ్గర జూలై 4న ఉదయం రెక్కీ నిర్వహించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడని ఆయనను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాలని రఘురామరాజు తెలిపారు. సీసీటీవీలో వ్యక్తి కదలికలను గుర్తించిన సిబ్బంది... ఐడి కార్డు తీసుకుని ఆరాతీస్తే ఏపీకి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ pc భాషగా తేలిందని రఘురామ తెలిపారు. 12 మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తన ఇంటి వద్ద కాపుకాసి అని తన వాహనాన్ని వెల్లడించారని పోలీసు అధికారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే మంగళవారం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ గచ్చిబౌలి లో పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.