హైదరాబాద్: పాతబస్తీలో ఎన్ఐఏ తనిఖీలు.. అదుపులో బీహార్ వాసి

By Siva Kodati  |  First Published Jul 5, 2022, 9:34 PM IST

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఓ హత్య కేసుకు సంబంధించి బీహార్ వాసిని అదుపులోకి తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. 


హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (nia raids) సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. స్థానిక లక్కీ హోటల్ సమీపంలోని ఓ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బీహార్ వాసిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఓ హత్య కేసులో అతనిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అతనిని ఆరా తీసినట్లుగా సమాచారం. సాయంత్రం నుంచి విచారించి బీహార్ వాసిని ఎన్ఐఏ అధికారులు వదిలేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!