పెద్దవాగులో ప్రయోగాత్మకంగా గెజిట్ ను అమలు చేయాలని జీఆర్ఎంబీ సమావేశం నిర్ణయం తీసుకొంది.తెలంగాణ అభ్యంతరాలతో పెద్దవాగులో పర్యవేక్షణకే బోర్డు పరిమితం కానుంది.
హైదరాబాద్: పెద్దవాగులో గెజిట్ నోటిఫికేషన్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని జీఆర్ఎంబీ సమావేశం సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది.హైద్రాబాద్‌లోని జలసౌధలో grmb ఛైర్మెన్ chandrasekhar iyer అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.
also read:పూర్తి కేటాయింపులు అందడం లేదు: తుంగభద్ర బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ
undefined
krishna, godavari నదుల పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నుండి ఈ గెజిట్ అమల్లోకి రానుంది. బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను బోర్డులు ఇప్పటికే గుర్తించాయి. నీటి కేటాయింపులు చేయకుండా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకు రావడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశంలో పెద్దవాగుపై ప్రయోగాత్మకంగా gazetteనోటిఫికేషన్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే సిబ్బంది మాత్రం ఎవరి రాష్ట్రాల పరిధిలోని వారే ఉంటారని సమావేశం స్పష్టం చేసింది. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకు రావాలని ఏపీ ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్‌ను telangana వ్యతిరేకించింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి పారుదల శాఖాధికారుల అభ్యంతరాలతో పెద్దవాగు పర్యవేక్షణకే జీఆర్ఎంబీ పరిమితం కానుంది.తమ ప్రభుత్వం అంగీకరిస్తేనే peddavaguను అప్పగిస్తామని తెలంగాణకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని తెలంగాణ సీఎం kcr, తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ rajat kumar లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖను కోరారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణలో 2 వేల ఎకరాల ఆయకట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 వేల ఆయకట్టు ఉంది.