విషాదం... స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

Arun Kumar P   | Asianet News
Published : Oct 11, 2021, 02:17 PM ISTUpdated : Oct 11, 2021, 02:28 PM IST
విషాదం... స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 

మెదక్: తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. స్పీకర్ వాహనశ్రేణి వస్తున్న విషయాన్ని గమనించకుండా రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ వాహనం గుద్దేసింది. దీంతో తీవ్ర గాయాలపైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే... medak district మనోహరాబాద్ మండలం కాళ్లకల్ మీదుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో నరసింహారెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా speaker convoy లోని ఓ వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర రక్తస్రావమై అతడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడు  ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగి నర్సింహారెడ్డిగా గుర్తించారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 

ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుందని పోలీసులు తెలిపారు. 

read more  హైదరాబాద్: అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించి... అల్లుడి హత్యాయత్నం

ఈ ప్రమాదంపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. తన కాన్వాయ్ లోని పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి చనిపోవడం దురదృష్టకరని pocharam srinivas reddy తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. assembly speaker అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి బాన్సువాడకు వెళ్ళుతున్న సమయంలో మేడ్చల్ సమీపంలోని కాళ్ళకల్ వద్ద ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. 

ప్రమాద సమయంలో స్పీకర్ వేరే వాహనంలో సంఘటన స్థలానికి దూరంగా ఉన్నట్లు కార్యాలయం వెల్లడించింది. అయితే ప్రమాద సమాచారం స్పీకర్ కు తెలిసిన వెంటనే తక్షణమే బాధితునికి వైద్య సహాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే వైద్య సహాయం అందేలోపే వ్యక్తి మృతిచెందాడని... తగు చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ పోచారం కోరినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. 

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు