తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

Published : Oct 11, 2021, 01:12 PM ISTUpdated : Oct 11, 2021, 01:51 PM IST
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

సారాంశం

telangana highcourt న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్‌ ఎం.ఎస్‌.ఆర్‌.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న Justice Satish Chandra Sharma తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో గవర్నర్‌ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

telangana highcourt న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్‌ ఎం.ఎస్‌.ఆర్‌.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న Justice Satish Chandra Sharma తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎవరంటే...
తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్త 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్ లోని భర్మతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు.

ప్రాథమిక విద్య జబల్ పూర్ లోని సెంట్రల్ స్కూల్ లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్ హరిసింగ్ గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిటి స్కాలర్ షిప్ పొందారు. అదే వర్సిటీలో న్యాయ పట్టా అందుకుని 1984, సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ బార్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. 

ఎల్ ఎల్ బీలోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ విషయాల్లో ప్రాక్టీస్ చేశారు. 1993లో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్ గా పదోన్నతి పొందారు.

Huzurabad Bypoll: అతి సామాన్యుడిలా ఆర్థిక మంత్రి... రోడ్డుపక్కన టిఫిన్ చేసిన హరీష్ రావు (వీడియో)

2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 యేళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?