రాజకీయాలు చేయడం లేదు, నన్ను ట్రోల్ చేశారు: తెలంగాణ గవర్నర్ తమిళిసై

Published : Apr 18, 2022, 02:46 PM IST
 రాజకీయాలు చేయడం లేదు, నన్ను ట్రోల్ చేశారు:  తెలంగాణ గవర్నర్ తమిళిసై

సారాంశం

రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ చెప్పారు. తనపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టా రీతిలో విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.

న్యూఢిల్లీ: తనకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తేల్చి చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.తనపై ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని తమిళిపై మండి పడ్డారు.మంత్రులు, ఎమ్మెల్యేలు తనను  ఇష్టా రాజ్యంగా విమర్శిస్తున్నారన్నారు. .పాత వీడియోలతో సోషల్ మీడియాలో తనను  Troll చేశారని చెప్పారు. ప్రజలను కలిస్తే తప్పుడు అర్ధం చేసుకొంటున్నారని ఆమె చెప్పారు. ఏ పదవిలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. తన పర్యటన సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

ఆదివారం నాడు Telangana Governor గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ న్యూఢిల్లీకి వచ్చారు. ఓ కేంద్ర మంత్రి కొడుకు వివాహనికి హజరయ్యేందుకు ఆమె New Delhi కి వచ్చారు.ఈ నెల 6వ తేదీనే ప్రధాని Narendra Modi, ఈ నెల 7న కేంద్ర మోంశాఖ మంత్రి Amit Shah ను ఆమె కలిశారు.  ఈ ఇద్దరితో భేటీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ అలా చేయడం టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందిగా మారితే తాను ఏం చేయలేనన్నారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించానన్నారు. కానీ తనను అవమానిస్తున్నారన్నారు. రాజ్ భవన్ కు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలన్నారు.  గవర్నర్  చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. 

గత కొంతకాలంగా తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. ఈ విబేధాలు ఇటీవల తారాస్థాయికి చేరకున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో కౌశిక్ రెడ్డిని పేరును కేబినెట్ సిఫారసు చేయగా.. గవర్నర్ దానికి ఆమోదం తెలుపలేదు. అప్పటి నుంచి గవర్నర్‌‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. 

సమక్క సారక్క జాతరలో పాల్గొనడానికి వెళ్లిన గవర్నర్‌‌కు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. గవర్నర్ తమిళిసై హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ పారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలపై తమిళిసై వివిధ సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

తాజాగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను హాజరుకాలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ హోదాలో తన పరిమితులు ఏంటో తనకు తెలుసునన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని తమిళిసై వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. ప్రజల సమస్యల కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. అందరితో సఖ్యతగా వుండటమే తనకు తెలుసునని తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ తెలంగాణ ప్రజల మేలు కోసమే వుందన్నారు. వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తమిళిసై వెల్లడించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?