
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాలు విసిరారు. సొంత పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నావని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసేవరకు బీజేపీ ఉద్యమం చేయాలన్నారు. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ మధ్య దోస్తి ఉన్నట్టేనని అన్నారు. చనిపోయిన బీజేపీ కార్యకర్త కుటుంబానికి బీజేపీ రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చేతకాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారా ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడతానని చెప్పారు.
ఇక, ఆదివారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అజయ్ ఓ సైకో అంటూ మండిపడ్డారు. ఆయనను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కుల కోసమే పువ్వాడ ఓవరాక్షన్ చేస్తున్నారన్నారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త Sai Ganesh నుంచి పోలీసులు ఎందుకు మరణ వాంగ్మూలం తీసుకోలేదో చెప్పాలని ఆయన కోరారు.
ఉద్దేశ్యపూర్వకంగానే సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. Congress పార్టీకి చెందిన ముస్తఫా తదితరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులను నిరసిస్తూ తాము కూడా ఆందోళనలు చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు. తాను కూడా ఖమ్మంకి వెళ్లి ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్‌పై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలన్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఎస్పీ చూడాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.