
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీపై.. ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోందడరెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో కలిసి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన రుణాలు ఒకే విడతలో మాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఖతార్ నుంచి నేవీ మాజీ అధికారులు విడుదల.. ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో ప్రశంసలు
ధరణి ద్వారా అక్రమంగా భూములు కాజేసిన ఆఫీసర్లపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అలాంటి ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చామని, కానీ మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడే ఇస్తామని అన్నారు.
అంగన్ వాడీ జాబ్స్ ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి పదే పదే..
అయితే ప్రస్తుతం మద్దతు ధర రూ.2060గా ఉందని, కాగా రూ.2600 చెల్లించి కొనుగోలు కేంద్రాల్లో సేకరిస్తున్నారని తెలిపారు. అందుకే బోనస్ పై ప్రస్తావన రాలేదని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ కు రావడం లేదని, ప్రజలు తీర్పును అవమానపరుస్తున్నారని ఆరోపించారు.