18 నెలలుగా (Allegations of espionage) ఖతార్ జైలులో మగ్గిన ఇండియన్ నేవీ మాజీ అధికారులు సురక్షితంగా భారత్ కు తిరిగి వచ్చారు (Ex-Indian Navy officers return to India after being released from Qatar jail). ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యపరమైన చొరవ (Prime Minister Narendra Modi's diplomatic initiative) వల్లే ఇది సాధ్యమైంది. దీంతో సోషల్ మీడియాలో ప్రధానిపై ప్రశంసలు (Pm Modi praised on social media) వెల్లువెత్తుతున్నాయి.

గూఢచర్యం ఆరోపణలపై నెలల తరబడి జైలు శిక్ష అనుభవించి ఖతార్ కోర్టు ఇటీవల విడుదలైన ఎనిమిది మంది భారత నౌకాదళ సిబ్బందిలో ఏడుగురు సోమవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తాము స్వదేశానికి తిరిగి రావడానికి ప్రధాని మోడీ నేతృత్వంలో నిరంతర దౌత్య ప్రయత్నాలే కారణమని అన్నారు.

Scroll to load tweet…

ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఏడుగురు భారత నౌకాదళ మాజీ అధికారులు మీడియాతో మాట్లాడారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో నేరుగా మాట్లాడినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తమను విడిపించడానికి ప్రధాని దౌత్యపరమైన చొరవే కీలకంగా ఉందని కొనియాడారు.

Scroll to load tweet…

‘‘చివరికి సురక్షితంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది. మా విడుదలకు ఆయన (ప్రధాని మోడీ) వ్యక్తిగత జోక్యం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. దానికి నేను ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఖతార్ స్టేట్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి కృతజ్ఞతలు’’ అని ఓ నేవీ మాజీ అధికారి అన్నారు.

Scroll to load tweet…

విడుదలలో ప్రధాని మోడీ పోషించిన పాత్రను మరో నేవీ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని మోదీ జోక్యం లేకపోతే మేం స్వేచ్ఛగా నడిచేవాళ్లం కాదు. మాకు స్వాతంత్య్రం రావడానికి అత్యున్నత స్థాయిలో ఆయన అలుపెరగని కృషి, జోక్యం లేకపోతే ఈ రోజు మీ ముందు నిలబడేవాళ్లం కాదు’’ అని వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

నేవీ మాజీ అధికారులు సురక్షితంగా భారత్ కు తిరిగి రావడం పట్ల సోషల్ మీడియాలో యూజర్లు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Scroll to load tweet…

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఎక్స్ (ట్విట్టర్) లో ఇలా పోస్ట్ పెట్టారు. ‘‘తప్పుడు 'గూఢచర్యం' ఆరోపణలపై ఖతార్ లో నిర్బంధించబడి మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను సజీవంగా తిరిగి తీసుకువస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎప్పటిలాగే ప్రధాని ‘మోడీ గ్యారంటీ’ మ్యాజిక్ లా పనిచేసింది. మొత్తం ఎనిమిది మందిని విడుదల చేశారు. ఏడుగురు ఇళ్లకు చేరుకున్నారు.’’ అని పేర్కొన్నారు. మరి కొందరు యూజర్లు కూడా ఈ పరిణామాన్ని భారతదేశ దౌత్యం గొప్ప విజయానికి ఉదాహరణ అంటూ కామెంట్స్ చేశారు.