Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి నేడు (మంగళవారం) సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు కూడా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి వెళ్లబోతున్నారు. పర్యటన షెడ్యూల్ ఇదే..
Medigadda Barrage: తెలంగాణ రాజకీయం నీళ్ల చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు లోని లోపాలను ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పిస్తూంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాగార్జున సాగర్ డ్యామ్( క్రుష్ణ నది) కేంద్రంగా కాంగ్రెస్ పార్టీపై తరుచుగా ధ్వజం ఎత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడీగడ్డ పిల్లర్లు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ క్రమంలో నేడు (మంగళవారం) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించాలని..ప్రభుత్వ ఆధ్వర్యంలో బస్సును ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
దీంతో నేడు మేడిగడ్డ సందర్శన షెడ్యూల్ ను ఖరారు చేశారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు కూడా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సం దర్శించడానికి వెళ్లబోతున్నారు.
మేడిగడ్డ పర్యటన షెడ్యూల్
ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్యేల్యేలు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటుంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శన.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అధికారులతో రివ్యూ మీటింగ్.
సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు ప్రయాణం..
రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.