గుడ్ న్యూస్.. 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. !

By Sairam Indur  |  First Published Dec 23, 2023, 9:59 AM IST

ప్రజలకు తెలంగాణ సర్కార్ (telangana government) గుడ్ న్యూస్ చెప్పబోతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల (new ration card applications) స్వీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని భావిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి అధికారికంగా మీ సేవల కేంద్రాల (meeseva) ద్వారా ఆన్ లైన్ లో వీటిని స్వీకరించాలని యోచిస్తోంది.


telangana new ration cards : తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు మోక్షం లభించనుంది. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసే ప్రక్రియ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియంతా ఓ కొలిక్కి వచ్చిన తరువాత ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేసిన రెజ్లర్ భజరంగ్ పూనియా.. కారణం చెబుతూ ప్రధానికి సుధీర్ఘ లేఖ

Latest Videos

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొత్తంగా ఇప్పటి వరకు 6,47,297 జారీ అయ్యాయి. అయితే చాలా కాలంగా కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించడం లేదు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డులు అందలేదు. అలాగే ఇప్పటికే కార్డుల్లో వారి పిల్లల పేర్లు చేర్చడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే కొత్త ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 

భార్య నల్లగా ఉందని విడాకులు కోరిన భార్త.. కోర్టు ఏం చెప్పిందంటే..?

కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి అవసరమైన విధి విధానాలు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే దాదాపుగా గతంలో ఉన్న నింబంధనలే ఈ సారి కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అదే రోజు ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని సర్కార్ యోచిస్తోంది.

Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికలకూ సునీల్ కనుగోలుకు బాధ్యత.. కాంగ్రెస్ కీలక నిర్ణయం

మీ సేవ సెంటర్ల ద్వారా ఆన్ లైన్ లో ఈ దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం అర్హుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో నే పరిశీలన చేపట్టాలని అనుకుంటోంది. గ్రామాల్లో అయితే గ్రామ సభలు, పట్టణాల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి అర్హులను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో మొత్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ కంటే ముందుగానే 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కొత్త దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెడితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

click me!