తెలంగాణలో కొత్తగా 9 కరోనా కేసులు, రెండు నెలల చిన్నారికి పాజిటివ్...

By SumaBala BukkaFirst Published Dec 23, 2023, 6:40 AM IST
Highlights

దీంతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా ఉన్న యాక్టివ్ కేసులు 22.  వీరిలో ఒకరు రికవరీ అయినట్టుగా తాజా బులిటిన్లో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మరోసారి పంజా విప్పుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్  బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాాగా  శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో మొత్తం తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో రెండు నెలల చిన్నారి ఉండడం గమనార్హం.  దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1కేసులు పెరుగుతున్నాయి. కేరళలో మొదలైన ఈ ఉధృతి క్రమంగా అనేక రాష్ట్రాలకు చేరుకుంటుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా ఉన్న యాక్టివ్ కేసులు 22.  వీరిలో ఒకరు రికవరీ అయినట్టుగా తాజా బులిటిన్లో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో శుక్రవారం ఒకరోజే 1245 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లుగా కూడా ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ టెస్టుల్లో మొత్తం తొమ్మిది మందికి కరోనా పాజిటివ్  అని తేలింది. వీరిలో 8 మంది హైదరాబాద్ కు చెందిన వారు కాగా, ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారని సమాచారం,

Latest Videos

ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా జేఎన్.1 వైరస్:2,669కి చేరిన కేసులు

టెస్టులు నిర్వహించిన వారిలో ఇంకా 68 మంది రిపోర్ట్స్ పెండింగ్లో ఉన్నాయి.  సంతోషకరమైన విషయం ఏమిటంటే రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. హైదరాబాదులోని నీలోఫర్ లో ఓ రెండు నెలల చిన్నారి కరోనా బారిన పడింది. ఆ చిన్నారికి వెండి లెటర్ పై చికిత్స అందిస్తున్నారు.  ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కూడా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు శాంపిల్స్ ను ఆర్టిపిసిటీ టెస్ట్ కోసం ఎంసీ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. ఇందులో రెండు పాజిటివ్గా తేలాయి. పాజిటివ్ కేసుల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా కేంద్రంలో ముందస్తు చర్యల్లో భాగంగా 100 పడకల కరోనా వార్డును ఏర్పాటు చేశారు. 

click me!