హైదరాబాద్ విమానాశ్రయంలో రూ.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం

By Mahesh Rajamoni  |  First Published Apr 5, 2023, 2:17 PM IST

Hyderabad: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 లక్షల విలువైన అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ బంగారంతో ఉన్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.49,71,736 విలువైన 807.10 గ్రాముల బరువున్న 12 బంగారు కడ్డీలు, 1 బంగారు గొలుసును చార్జబుల్ టార్చ్ లైట్ లోపల దాచిన‌ట్టు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు.
 


 Hyderabad airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది.  రూ.50 లక్షల విలువైన అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ బంగారంతో ఉన్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.49,71,736 విలువైన 807.10 గ్రాముల బరువున్న 12 బంగారు కడ్డీలు, 1 బంగారు గొలుసును చార్జబుల్ టార్చ్ లైట్ లోపల దాచిన‌ట్టు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. సుమారు రూ.50 లక్షల విలువైన 807.10 గ్రాముల బంగారు గొలుసు, 12 కట్ చేసిన బంగారు కడ్డీలను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడు అక్ర‌మంగా బంగారంతో వ‌స్తున్నాడ‌నే ముంద‌స్తు స‌మాచారంతో అధికారులు నిఘా పెట్టారు. ఈ క్ర‌మంలోనే నిందితుడు ఉద‌యం 08:45 గంటలకు ఇక్క‌డ‌కు చేరుకున్నాడు. అత‌న్ని గుర్తించిన పోలీసులు విచార‌ణ కోసం అదుపులోకి తీసుకున్నారు. 

Latest Videos

ఈ క్ర‌మంలోనే అత‌ని వ‌స్తువులు ప‌రిశీలించ‌గా, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారం బ‌య‌ట‌ప‌డింది. ఆ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న‌ను గుర్తించిన అధికారులు అనుమానంతో తనిఖీ చేయగా రూ.49,71,736 విలువ చేసే 807.10 గ్రాముల బరువున్న 12 బంగారు కడ్డీలు, 1 బంగారు గొలుసు లభించాయి. బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అంత‌కుముందు రోజు కూడా.. 

అంత‌కుముందు రోజు కూడా అధికారులు హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో నుంచి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నారు. మంగ‌ళ‌వారం నాడు శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని పట్టుకుని రూ.12.94 లక్షల విలువైన 210 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి ఎస్వీ - 750 విమానంలో రియాద్ మీదుగా వచ్చిన ఓ ప్రయాణికుడు క్యాప్సూల్ రూపంలో బంగారాన్ని దాచినట్లు అధికారులు తెలిపారు. అనుమానంతో అతడిని తనిఖీ చేయగా బంగారం దొరికింది. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

click me!