వాట్సాప్‌లో మేసేజ్ చూస్తే అరెస్ట్ చేస్తారా?: బండి సంజయ్ అరెస్ట్‌పై తరుణ్ చుగ్

By narsimha lode  |  First Published Apr 5, 2023, 1:52 PM IST

 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్ ను   బీజేపీ   తెలంగాణ ఇంచార్జీ  తరుణ్ చుగ్ స్పందించారు.   తమ పార్టీ నేతలపై  కేసీఆర్ సర్కార్  తప్పుడు  కేసులు  పెడుతుందని  చెప్పారు.  


హైదరాబాద్: తెలంగాణ సీఎం  కేసీఆర్  డైవర్షన్  రాజకీయాలకు  పాల్పడుతున్నారని  బీజేపీ  తెలంగాణ  ఇంచార్జీ  తరుణ్ చుగ్  విమర్శించారు. బండి సంజయ్ అరెస్ట్ ను  తరుణ్ చుగ్ ఖండించారు. 

బండి సంజయ్ అరెస్ట్ పై  బుధవారంనాడు  తురుణ్ చుగ్  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ వ్యవస్థను గౌరవించడం లేదన్నారు. ఎలాంటి నోటీసులు  ఇవ్వకుండానే  బండి సంజయ్  ను పోలీసులు అరెస్ట్  చేయడాన్ని తరుణ్ చుగ్ తప్పు బడుతున్నారు.  వాట్సాప్ లో  మేసేజ్ వస్తే  చూడడం తప్పా  అని  ఆయన ప్రశ్నించారు.  తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై  కేసీఆర్ సర్కార్ తప్పుడు  కేసులు బనాయిస్తుందని   ఆయన  ఆరోపించారు. 

Latest Videos

పోలీసులను ఉపయోగించుకుని కేసీఆర్   తమ పార్టీని దెబ్బతీసేందుకు  ప్రయత్నిస్తుందన్నారు.  కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను  ఎత్తి చూపుతున్నందుకు  గాను   తమ పార్టీపై  బీఆర్ఎస్  కక్షగట్టిందన్నారు.  బండి సంజయ్  అరెస్ట్ ను  తమ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని  తరుణ్ చుగ్  చెప్పారు. 

టెన్త్ క్లాస్  హిందీ పేపర్ లీక్  అయిందని సోషల్ మీడియాలో  ప్రచారం వైరల్ గా మారింది.  ప్రశాంత్  అనే  వ్యక్తి  బండి సంజయ్  కు  వాట్సాప్ లో  ఈ పేపర్ ను షేర్ చేశారు పేపర్ లీక్ విషయమై  బండి సంజయ్ పై   పోలీసులు కేసు నమోదు  చేశారు. నిన్న రాత్రి  కరీంనగర్ లో  ఉన్న బండి సంజయ్  ను పోలీసులు  అరెస్ట్  చేశారు. నిన్న  రాత్రి కరీంనగర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు రతరలించారు.

ఇవాళ  ఉదయం   బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుండి  ఉమ్మడి వరంగల్ జిల్లాకు  బండి సంజయ్  కు తరలించారు . బండి సంజయ్  అరెస్ట్ పై  బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.  పరీక్షల నిర్వహణలో  ప్రభుత్వ చేతకానితనం  బయటపడిందని  బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.  

also read:అనర్హత వేటేయాలి: బండి సంజయ్ పై హరీష్ రావు ఫైర్

బండి సంజయ్ అరెస్ట్  విషయమై  బీజేపీ కేంద్ర నాయకత్వం  ఆరా తీసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయమై  మాజీ ఎమ్మెల్సీ  రామచంద్రరావుతో   నడ్డా ఫోనులో మాట్లాడారు. 
 


 

click me!