పబ్జీ గేమ్ లో పరిచయమైన యువతికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆ తరువాత నగ్నఫొటోలతో బ్లాక్ మెయిల్ కు దిగాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిపై యువకుడు లైంగికవేధింపులకు పాల్పడి, బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ఆ యువతి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పబ్జీ గేమ్ లో పరిచయమైన యువతితో ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత ఆ యువతికి కూల్ డ్రింక్ తో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ యువతి నగ్నఫొటోలు తీశాడు. వీటితో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు.
దీంతో అతని వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో మధురానగర్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.