గుంతలో పడి చిన్నారి మృతి.. సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు, బిల్డర్లు హద్దుమీరితే

Siva Kodati |  
Published : May 02, 2023, 04:32 PM IST
గుంతలో పడి చిన్నారి మృతి.. సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు, బిల్డర్లు హద్దుమీరితే

సారాంశం

నీటి గుంతలో పడి చిన్నారి మరణించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో సెల్లార్ల నిర్మాణంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని సర్కిళ్ల ఏసీపీలు, డీసీలకు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో గత కొంతకాలంగా వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు అల్లాడుతున్నారు. సాయంత్రం పూట ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడుతూ వుండటంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోతోంది. దీంతో డ్రైనేజ్, నాళాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ వుండటంతో సెల్లార్‌ల తవ్వకాలు, నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బిల్డర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలో సెల్లార్ల నిర్మాణంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని సర్కిళ్ల ఏసీపీలు, డీసీలకు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బిల్డర్లు రక్షణ చర్యలు తీసుకోవాలని.. సెల్లార్లలో నీరు నిల్వవుండకుండా చూసుకోవాలని సూచించారు. ఇలాంటి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని లోకేష్ కుమార్ తెలిపారు. సరైన చర్యలు చేపట్టని బిల్డర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. 

ALso Read: విషాదం : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గుంతలో పడి బాలుడి మృతి..

కాగా.. హైదరాబాదులో మరో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. పిల్లలు ప్రతీరోజూ అక్కడికి వచ్చి ఆడుకుంటారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన చిన్నారి రెండో తరగతి చదువుతున్నాడు. పక్కనే ఉన్న షోరూంలో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తుంటారని తెలుస్తోంది. వేస్ట్ వాటర్ తీయడం కోసం ఆ గుంతను తవ్వినట్టుగా అక్కడి వారు చెబుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ గుంత నిండిపోయింది. దానిమీదున్న కర్ర మీదికి ఎక్కడానికి బాలుడు ప్రయత్నించడంతో పట్టుతప్పి గుంతలో పడిపోయాడని చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి