ములుగు జిల్లాలో పోలీసుల వాహనం బోల్తా.. ఎస్‌‌ఐతో సహా డ్రైవర్ మృతి..

Published : May 02, 2023, 04:32 PM IST
ములుగు జిల్లాలో  పోలీసుల వాహనం బోల్తా..  ఎస్‌‌ఐతో సహా డ్రైవర్ మృతి..

సారాంశం

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పోలీసు ఎస్‌ఐ సహా డ్రైవర్ మృతిచెందారు.

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పోలీసు ఎస్‌ఐ సహా డ్రైవర్ మృతిచెందారు. వివరాలు.. జిల్లాలోని ఏటూరునాగారం మండం జీడివాగు వద్ద పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఏటూరు నాగారం ఎస్‌ఐ ఇంద్రయ్య, డ్రైవర్ మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతేదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉంటే..  జగిత్యాల జిల్లా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కానిస్టేబుల్ మృతిచెందిన సంగతి తెలిసిందే. 2018 బ్యాచ్‌కు చెందిన వేదశ్రీ మల్యాల పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం ఆమె నడుపుతున్న ద్విచక్ర వాహనం మల్యాల మండలంలోని  సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా గాయపడింది. ఆమె హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.

దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళా కానిస్టేబుల్ భౌతికాయానికి ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా ఎస్పీ, పలువురు పోలీసులు నివాళులర్పించారు. ఈ ఘటనతో వేదశ్రీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu