ప్రతీ గింజా కొంటాం.. అన్నదాతలు ఆధైర్యపడొద్దు : రైతాంగానికి కేటీఆర్ భరోసా

By Siva KodatiFirst Published May 2, 2023, 4:10 PM IST
Highlights

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.  ఇప్పటికే 7.5 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కేటీఆర్ తెలిపారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నామన్నారు. 

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అదానీ కొన్న ఎయిర్‌పోర్ట్‌కు జీఎస్టీ వుండదు కానీ.. పాలు , పెరుగులపై జీఎస్టీ వేసిన ఘనుడు మోడీ అంటూ చురకలంటించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నామన్నారు. కర్ణాటక ఎన్నికల మేనిఫేస్టోలో మూడు సిలిండర్లు ఫ్రీ అని ప్రధాని అన్నారని.. ఆయన కర్ణాటకకు ప్రధానా లేక దేశానికా అని కేటీఆర్ ప్రశ్నించారు. 

జలవనరులు పెరిగి ఇబ్బడిముబ్బడిగా పంట పెరిగిందని మంత్రి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు కేటీఆర్ తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా హెక్టారుకు 25 వేల నష్టపరిహారం చెల్లించనున్నామని మంత్రి చెప్పారు. రైతులు నమ్మకంతో, ధైర్యంతో ఉండాలన్నారు. ఇప్పటికే 7.5 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కేటీఆర్ తెలిపారు. ప్రతీ గింజా కొంటామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు అధైర్య పడాల్సిన పని లేదన్నారు. ఇప్పటి వరకు మంచి కల్చర్ కాదని పదేపదే చెప్పి..ఇప్పుడేమో కర్ణాటకలో 3 సిలిండర్‌లు ఉచితమని అనడం కరెక్ట్ కాదని కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ ప్రజలకు మూడు సిలిండర్‌లు ఎందుకు ఫ్రీగా ఇవ్వరని మంత్రి ప్రశ్నించారు. 


 

click me!