పాలమూరు పోలీసులకు స్త్రీ చైతన్య శిక్షణ

First Published Feb 28, 2017, 12:48 PM IST
Highlights

 తెలంగాణాలో  మహిళల పట్ల జరిగే నేరాల మీద, బాధితులతో  వ్యవహరించాల్సిన  తీరు మీద శిక్షణ

తమ మీద జరిగే నేరాల  గురించి ధైర్యంగా మహిళలు  వెల్లడించేందుకు అనువయిన వాతావరణ కల్పించే నిమిత్తం మహబూబ్ నగర్  జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులకు ప్రత్యేక  శిక్షణ (జెండర్ ఫెలోషిప్ ఫర్ కాన్ స్టేబుల్ ఆఫీసర్స్) ఇవ్వ బోతున్నారు.

 

పోలీసు బలగాన్ని ప్రజలకు చేరువచేయడానికి ఎపుడూ కృషి చేసే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి  అధ్వరంలో ఈ శిక్షణ మే నెలలో జరుగుతుంది. ఢిల్లీకి చెందిన పీపుల్ ఫర్ ప్యారిటీ (పిఎఫ్ పి) సహాకారంతో జరిగే ఈ శిక్షణకోసం  30 పోలీసు అధికారులను ఎంపిక చేశారు.

 

పుకార్ (సాయం  కోసం పిలుపు)పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా పోలీసులలో  మహిళల పట్ల బాధ్యతాయుతమయిన దోరణి పెంపొందిచేందుకు, మహిళ మీద ఏదైనా నేరం జరిగినపుడు  దానిని బహిరంగ పరిచే బాధ్యతలను  పెంపొందింపచేసేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించామని  రెమా రాజేశ్వరి తెలిపారు.

 

 నేరాన్ని అర్థం చేసుకునే నేపుణ్యాన్ని అందివ్వడమే కాకుండా,నేర బాధితుల పట్ల పాటించాల్సిన విలువలను పోలీసు బలగంలో  అమలులోకి తీసుకురావడం మీద  ఈ శిక్షణ దృష్టి నిలుపుతుందని ఆమె చెప్పారు.  ఈ శిక్షణ లో భాగంగా మూడురోజుల వర్క్ షాపు ఈ రోజు మొదలయింది. ఈ  కార్యక్రమానికి హైదరాబాద్ రేంజ్ డిఐజి కూడాహాజరయ్యారు.

ఈ శిక్షణలో ప్రధానంగా, స్త్రీ పురుష అసమానతలు, జండర్ కాన్సెప్ట్ అంటే ఏమిటి, చుట్టూ సమాజంలో మహిళలను చిన్నచూపుతో చూడటం అనేది ఎలా మొదలయింది, దాని దుష్ప్రభావాలు, స్వీయ స్ప్రుహ,  వ్యక్తీకరణ నైపుణ్యం, పోలీసులో  స్వీయ స్పృహ, సమాజంలో ఉండే సామాజిక గుర్తింపులు, దాని మీద  ఇపుడున్న అధికార వ్యవస్థ ప్రభావం,  సానుభూతి, నిత్యజీవితంలో సానుభూతి ప్రయోజనం తదితరల అంశాల గురించి పోలీసు అధికారులకు శిక్ష ణ ఇస్తారు.

 

తెలంగాణా సమాజంలో మహిళ హోదా , స్త్రీ పురుష అసమానతలు, దాని దుష్పరిణామాలు, మహిళా పోలీసు అధికారులలో ఆత్మ స్థయిర్యం కల్గించడం, తెలంగాణాలో మహిళల మీద సాధారణంగా జరిగే నేరాలు, వాటి సమాచారాన్ని సురక్షితంగా సేకరించడం,ఎంపిక చేసిన మహిళా పోలీసు అధికారులలో నాయకత్వం నూరిపోయడం వంటి అంశాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.

 

మహబూబ్ నగర్ జిల్లాలో మహిళల మీద నేరాల నమోదుకావడం పెరుగుతూ ఉన్నాయి. 2014లో 432 కేసులునమోదయితే, 2015లో 471 కి పెరిగాయి. 2016 రికార్డయిన 529.  ఈ నేపథ్యంతో, బాధితులను సానుభూతితో అర్థం చేసుకోవడం నేరాలకు మొదట స్పందించాల్సిన కాన్ స్టేబుల్స్ అలవర్చడం  అవసరమని జిల్లా పోలీసు యంత్రాంగ భావించడమో ఈ శిక్షణ దారి తీసింది.

 

వర్క్ షాపు  ప్రారంభానికి చేతన (ఎ ఎస్ పి యుటి), బి భాస్కర్ (డిఎస్పి, మహబూబ్ నగర్ ),   పి శ్రీనివాస్ రెడ్డి (డిఎస్ పి, నారాయణ్ పేట) పిఎఫ్ పి ప్రతినిధులు అధిత్య, మోనిషా లు హాజరయ్యారు.

click me!