బాంబులకు ఈ హైదరాబాద్ బూట్లతో చెక్

First Published Feb 28, 2017, 10:22 AM IST
Highlights

మందుపాతరలకు జవాన్లు బలి అనే వార్తలను ఇకపై మనం చూసే అవకాశం ఉండదు. బాంబు పేలుడును కూడా తట్టకోగల సరికొత్త బూట్లను మన హైదరాబాద్ లో తయారు చేశారు. త్వరలో ఇవి ఆర్మీకి అందుబాటులోకి రానున్నాయి.

ల్యాండ్ మైన్ ల ధాటికి దేశంలో వేలాది మంది జవాన్లు మరణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు, చత్తీఘడ్, జార్ఘండ్ పరిసరాల్లో మావోయిస్టులు అమర్చుతున్న మైన్స్ వల్ల ప్రతి ఏటా వేల మంది బలైపోతున్నారు.

 

ఈ మైనింగ్ పేలుళ్ల నుంచి రక్షించే అవకాశాలున్న ప్రతీ అంశాలను హోం మంత్రిత్వ  శాఖ , ఆర్మీ కూడా తీవ్రంగా పరిశీలించింది.

 

మైనింగ్ పేలుడు ఆపే బూట్లను ఇతర దేశాల నుంచి కొనుగోళు చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కానీ, అవి ఏ మాత్రం సంతృప్తికరంగా లేవు. దీంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది.

 

అయితే హైదరాబాద్ కు చెందిన ఇంటర్నేషనల్ అడ్వాన్సడ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పవర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ( ఏఆర్సీఐ) ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంది. ఆరేళ్లుగా ఇతర సంస్థలతో కలసి మైనింగ్ పేలుడును తట్టకుకొనే బూట్లను తయారు చేసింది. త్వరలో వీటిని భారీ స్థాయిలో తయారు చేసి ఆర్మీకి అందజేయనుంది.

 

ఈ యాంటీ మైనింగ్ బూట్లకు తెనెతుట్టే ఆకృతే స్ఫూర్తిగా నిలవడం విశేషం. సిరామిక్ పదార్థాన్ని తెనెతుట్టే గూడు మాదిరిగా రూపొందించి  ఈ బూట్లను రూపొందించారు.

బూట్ల తయారీలో వీరికి కాన్పూర్ కు చెందిన డీఎంఎస్ఆర్డీఈ కూడా ఏంతో తోడ్పాటును అందించింది.

గతంలో 4 కేజీలున్న ఈ బూట్లను చివరకు 2.9 కేజీలకు కుదించారు. తీవ్రస్థాయిలో బాంబు పేలుడుజరిగినా దాన్ని తట్టుకొనేలా బూట్ల రూపకల్పన జరిగింది.

దీన్ని వేసుకొని మైనింగ్ మీద కాలు పెట్టినా ప్రాణాలతో భయపడపడొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయోగపరీక్ష చంఢీగఢ్ లో పూర్తి చేశారు.

click me!