సూర్య ‘గ్యాంగ్’ సినిమా తరహాలో దొంగతనం.. సీబీఐ పేరుతో బంగారం, వజ్రాలు, నగదుతో పరారీ..

By SumaBala BukkaFirst Published Dec 15, 2021, 10:55 AM IST
Highlights

గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో CBI officials సోదాలు చేపట్టారు. సీబీఐ అధికారుల పేరుతో నటిస్తూ నలుగురు వ్యక్తులు 1,340 గ్రాముల బంగారు ఆభరణాలు, డైమండ్ సెట్లు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారంనాడు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ : రోజు రోజుకూ వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దొంగలు కొత్త కొత్త పద్ధతుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. దర్జాగా అధికారుల రూపంలో ఇంట్లో చొరబడి బాహాటంగా దొంగతనాలు చేస్తున్నారు. అచ్చం అక్షయ్ కుమార్ బాలీవుడ్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’, తమిళ హీరో సూర్య  ‘గ్యాంగ్’ సినిమాలను ఇన్ స్పిరేషన్ తీసుకున్నారో ఏమో.. దొంగలు అచ్చు అలాగే దోపిడీకి పాల్పడ్డారు. 

ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో CBI officials సోదాలు చేపట్టారు. సీబీఐ అధికారుల పేరుతో నటిస్తూ నలుగురు వ్యక్తులు 1,340 గ్రాముల బంగారు ఆభరణాలు, డైమండ్ సెట్లు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారంనాడు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ Professional exploitationఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనపై రియల్టర్ భార్య భాగ్యలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నానక్రామ్‌గూడలోని Jayabheri Orange Countyలోని తన అపార్ట్‌మెంట్‌కు సోమవారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు వచ్చారని, వారు తమను తాము సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారని ఆమె తెలిపారు. మీ ఇంట్లో సోదాలు చేసేందుకు తాము వచ్చామని చెప్పారన్నారు.

రూ.3250 కోట్ల మోసం: నాంపల్లి కోర్టులో కార్వీ కేసుపై చార్జీషీట్ దాఖలు

పోలీసులు నమోదు చేసుకున్న ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ నలుగురు వ్యక్తులు మారుతీ సుజుకి ఎర్టిగాలో వచ్చారు. వెంటనే అచ్చం సినీ పక్కీలో తమ ఐడి కార్డులను ఫ్లాష్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు. వెంటనే హడావుడి చేస్తూ మహిళను , ఆమె ముగ్గురు పిల్లలను కదలకుండా ఒక్కచోట కూర్చోమని అడిగారు. వారి డ్రైవర్లను హాల్‌లో ఉండమని చెప్పారు.

ఆ తరువాత “వారు బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. మొత్తం సోదా చేశారు. హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న లాకర్ కీలను తీసి లాకర్‌ని తెరిచారు. అందులోని  కొంత నగదుతో పాటు కుటుంబానికి చెందిన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత వాటితో ఉడాయించారు’’ అని పోలీసులు తెలిపారు.

అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఆస్తులు:హెచ్ఎండీఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ అరెస్ట్

ఇదంతా మెరుపు వేగంతో జరగడంతో మహిళ ఇది మోసం అని గ్రహించే అవకాశం రాలేదు. అంతేకాదు వచ్చింది నిజంగానే సీబీఐ వాళ్లా? మోసగాళ్లా? అని తెలియలేదు. అచ్చం ప్రొఫెషనల్స్ లాగానే ఉండడంతో ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించేందుకు సమయం పట్టింది. తరువాత అది మోసమేనని గ్రహించి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటన విన్న  పోలీసులు కూడా షాక్ అయ్యారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇంతలో, ఫిర్యాదుదారు అయిన రియాల్టర్ భార్య తనింటికి వచ్చి మోసం చేసిన వారిని.. గుర్తుపడతానని చెప్పారు. దీంతో వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.

click me!