హైద్రాబాద్ హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన జగన్ ను ఏసీబీ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు జగన్ ఇంటిపై మంగళవారం నుండి దాడులు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్: HMDA విజిలెన్స్ విభాగంలో డిఎస్పీగా పనిచేసిన జగన్ ను ఏసీబీ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుండి జగన్ ఇంటితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో acb అధికారులు సోదాలు చేశారు. హెచ్ఎండీఏలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో jagan అవినీతికి పాల్పడినట్టుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అవినీతి నిరోధక శాఖాధికారులు జగన్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. దీంతో 2019లో జగన్ ను హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం నుండి dgp కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా ఓపెన్ ప్లాట్ విషయంలో Koteshwara rao అనే వ్యక్తి నుండి రూ. 4 లక్షలు తీసుకొన్నారని జగన్ పై ఆరోపణలున్నాయి.
also read:తెలుగు అకాడమీ స్కాం: దర్యాప్తు బాధ్యతలు సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ.. కారణమిదే
Hyderabad హబ్సిగూడలోని జగన్ ఇంటితో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్ ఇంటిలో సుమారు కిలో బంగారంతో పాటు భారీగా నగదును స్వాదీనం చేసుకొన్నారు. జగన్ ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారని ఏసీబీ గుర్తించింది. జగన్ అక్రమంగా ఆస్తులను కలిగి ఉన్నాడని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారం నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని జగన్ ను ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు.హెచ్ఎండీఏ నుండి రిలీవ్ అయ్యాక కూడ జగన్ లంచాలు తీసుకొన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. జగన్ తో పాటు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ రామును కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా రెండు రోజులుగా సోదాలు నిర్వహించారు. జగన్ అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.