గాంధీ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు విజయ్

By narsimha lodeFirst Published Aug 19, 2021, 3:12 PM IST
Highlights


గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో  సెక్యూరిటీ గార్డు విజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  మహిళపై అత్యాచారం చేసినట్టుగా విజయ్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టుగా తెలిసింది. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు.  గ్యాంగ్ రేప్ ఘటన వెలుగు చూసిన తర్వాత కన్పించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఘటన జరిగిన రోజున విజయ్ అనే సెక్యూరిటీ గార్డుతో బాధిత మహిళ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో  వెళ్లిన తర్వాత చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆచూకీ కన్పించకుండా పోయిన బాధిత మహిళను నారాయణగూడలో ఇవాళ పోలీసులు గుర్తించారు. 

అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి విజయ్ తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయమై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ సహా మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

also read:గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్: తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళ తన భర్తకు కిడ్నీ చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో తనకు తోడుగా చెల్లిని కూడ తెచ్చుకొంది.
అయితే గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై  గ్యాంగ్ రేప్ ఘటనపై 10 పోలీస్ బృందాలు విచారణ చేస్తున్నారు


 

click me!