గడ్డం బ్రదర్స్‌కు షాక్.. టీఆర్ఎస్ నుంచి వినోద్‌ సస్పెన్షన్

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 1:23 PM IST
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నెర్ర చేశారు. నలుగురు కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నెర్ర చేశారు. నలుగురు కీలక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది.

వీరిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, గజ్జెల నగేశ్, జలంధర్ రెడ్డి, శంకర్‌ ఉన్నారు. అదిలాబాద్ జిల్లా చెన్నూర్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి గడ్డం వినోద్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సోదరుడు వివేక్‌తో కలిసి కాంగ్రెస్ గూటికి వెళతారని ప్రచారం జరిగింది.

అయితే కేసీఆర్, కేటీఆర్ రంగంలోకి దిగి.. ఎమ్మెల్సీ లేదా కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తామని తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు. అయినప్పటికి వినోద్ మెత్తబడనట్లు సమాచారం. ఈ క్రమంలో వినోద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచనలం కలిగిస్తోంది. దీనిపై గడ్డం బ్రదర్స్ ఎలాంటి స్టెప్ వేస్తారో వెయిట్ చేయాల్సిందే. 

కేసీఆర్‌కు షాక్: బెల్లంపల్లి నుండి బరిలోకి వినోద్, తెర వెనుక కథ ఇదీ

రంగంలోకి కేసీఆర్: వినోద్‌కు బంపరాఫర్

కాంగ్రెస్‌లోకి వెళ్లొద్దు...ఎమ్మెల్సీ ఇస్తాం...వినోద్‌కు కేటీఆర్ ఆఫర్..?

కేసీఆర్ కు భారీ షాక్: కాంగ్రెసులోకి గడ్డం వినోద్

చెన్నూరు గులాబీ లొల్లి: కేటీఆర్‌తో వివేక్, వినోద్ భేటీ
 

click me!