
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు స్టార్ కాంపైనర్ విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ రెండింటికే పరిమితమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజాకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్‌కు మద్దతుగా విజయశాంతి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రగతి భవన్ కు, ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారని అన్నారు.
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి కార్పేరేట్ కాలనీ వరకు రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్ప్రజల కష్టాలు పట్టించుకున్నపాపన పోలేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఆనంద్ ప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆనంద్ హామీ ఇచ్చారు.