ఇక ముందూ నా బాధ్యత ఇలాగే నిర్వర్తిస్తా - నెల రోజుల పాలనపై రేవంత్ రెడ్డి

By Sairam Indur  |  First Published Jan 7, 2024, 1:21 PM IST

Revanth reddy : గడిచిన నెల రోజుల పాలనపై  తృప్తిని ఇచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తాను అని ఆయన పేర్కొన్నారు.


anumula revanth reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నెల రోజులు గడిచింది. ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల్లో జరిగిన పాలనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణం తనకు తృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఇక ముందు కూడా ఇలాగే తన బాధ్యతను నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. 

#boycottmaldives : భారతీయులను అవమానించిన మాల్దీవ్స్ ... భారీ మూల్యం చెల్లించుకుంటోందిగా..!

Latest Videos

‘‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.’’ అని ఆయన పేర్కొన్నారు. 

అయోధ్య ఆలయంలో అద్భుతాలు...ఆ రోజున రామయ్య విగ్రహంపై నేరుగా సూర్యకిరణాలు

‘‘పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ, సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది.’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Ayodhya Ram Mandir : ఇది కదా మత సామరస్యమంటే .. అయోధ్య నుంచి ‘‘ రామజ్యోతి’’తో కాశీకి ముస్లిం మహిళలు

‘‘రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

click me!