
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో మరో చిన్నారి బలయ్యింది. ఆడపిల్ల అయితే చాలు చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారలకు పాల్పడుతున్న కామాంధుల కర్కషత్వానికి మరో చిన్నారి ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది. హైదరాబాదులోని శంషాబాద్ ఏరియాలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ చిన్నారిపై అత్యంత పాశవికంగా జరిగిన ఈ దాడిలో తీవ్ర గాయాలపాలయ్యింది.
పాపను గమనించిన స్థానికులు హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపను పరీక్షించిన వైద్యులు వెంటనే పాపకు సర్జరీ చేశారు. అయితే పాప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. శంషాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న లేబర్ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చిన్నారి తల్లిదండ్రులు బెంగుళూరు నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వలస వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన వెంకటయ్యను అరెస్టు చేశారు.
భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. రూ. రూ.116 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు...
ఇదిలా ఉండగా, మార్చి 13న ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో మరొకటి వెలుగు చూసింది. తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన ఘటన వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆమె మార్చి ఒకటో తేదీన కళ్యాణ్ నగర్ లో ఉండే బంధువుల ఇంటికి తల్లితో కలిసి వెళ్ళింది. అక్కడ బంధువులు 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే దీనికి బాలిక ఒప్పుకోలేదు.
అది సతీష్ కు నచ్చలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలికను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా ఆమె మీద అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల మూసాపేట ప్రాంతంలో ఉండే బాలిక అమ్మమ్మ అనారోగ్యంతో ఉండడంతో చూడడానికి వచ్చారు. ఈ సమయంలో బాలిక ముభావంగా ఉండడం, ఏదో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన అమ్మమ్మ.. ఆమెను ఏం జరిగిందని ఆరా తీసింది.
దీంతో బాలిక విషయం మొత్తం అమ్మమ్మకు చెప్పి బావురుమంది. విషయం విన్న అమ్మమ్మ మొదట షాక్ అయ్యింది. ఆ వెంటనే బాలికను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. సదరు నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.