Latest Videos

భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. రూ. రూ.116 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు...

By SumaBala BukkaFirst Published Mar 16, 2023, 9:03 AM IST
Highlights

శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త తెలిపింది. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే డెలివరీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. 

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీరామ భక్తులకు శుభవార్త తెలిపింది.  శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను  భక్తులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు తలంబ్రాలు కావలసినవారు ఆర్టీసీ కార్గో పార్సిల్ కేంద్రానికి రూ. 116 చెల్లించాలని..  తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని బస్ భవన్ లో కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను సజ్జనార్ ఆవిష్కరించారు. 

సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం భద్రాద్రి నుంచి నేరుగా భక్తుల ఇంటికే తలంబ్రాలను పంపిస్తామని ఆయన తెలిపారు. ముందుగా రూ.116 చెల్లించి స్వయంగా బుకింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనాలు మాట్లాడుతూ ‘నిరుడు దాదాపుగా 89 వేల మందికి ఇలాగే తలంబ్రాలను అందించాం. భద్రాద్రికి వెళ్లి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలనుకుని.. వెళ్లలేకపోయిన భక్తులకు.. తలంబ్రాలు కావాలనుకునేవారికి ఈ సదుపాయం ఎంత ఉపయోగంగా ఉంటుంది.   ఈ సదుపాయాన్ని భక్తులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి’  అని తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు యువతులపై దాడి, ఒకరి మృతి...!

ఇక తలంబ్రాలను తెప్పించుకోవాలనుకునేవారు.. 9177683134, 7382924900, 9154680020 అనే ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఫోన్ నెంబర్లను  సంప్రదించవచ్చని  తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో సహా తదితరులు పాల్గొన్నారు.

click me!