న్యూఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఢల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కవిత హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. గురువారంనాడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవితను విచారించనున్నారు. ఈడీ విచారణకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో కేసీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ఈడీ విచారణకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడనున్నారు.
ఈడీ విచారణకు వెళ్లే ముందు కవిత మంత్రులు కేటీఆర్,హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు కవితతో సమావేశమయ్యారు. కవిత ఈడీ విచారణకు వెళ్లే నేపథ్యంలో కేసీఆర్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను కేసీఆర్ నివాసం వైపునకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
undefined
ఈడీ విచారణకు వెళ్లే ముందు మీడియా సమావేశంలో కవిత ఏం మాట్లాడుతారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది.
ఈ నెల 11వ తేదీన ఈడీ అధికారులు కవితను మొదటిసారి విచారించారు. ఇవాళ రెండో దఫా ఈడీ విచారణకు కవిత హాజరౌతారు. ఈడీ విచారణపై స్టే కోరుతూ నిన్న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది .ఈ నెల 24వ తేదీన కవిత పిటిషన్ ను అధికారులు విచారించనున్నారు.