హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: నలుగురు అరెస్టు.. గంజాయి, హశిశ్ ఆయిల్ స్వాధీనం

By telugu teamFirst Published Oct 9, 2021, 8:57 PM IST
Highlights

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. మీర్‌పేట్‌లో గంజాయి, హశిశ్ ఆయిల్ అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. మూడు కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 600 గ్రాముల గంజాయి, 8 ఎంఎల‌ల హశిశ్ ఆయిల్‌ను సీజ్ చేశారు. ఒక హోండా యాక్టివా బైక్, మూడు మొబైల్ ఫోన్లు.. మొత్తం రూ. 85వేల ప్రాపర్టీని స్వాధీనం చేశారు.

హైదరాబాద్: రాజధాని నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, హశిశ్ ఆయిల్ వినియోగం జరుగుతున్నది. మీర్‌పేట్ పోలీసులు, ఎల్‌బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లు ఈ వ్యవహారాన్ని ఛేదించాయి. drugs అమ్ముతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 600 గ్రాముల ganja, 8 మిల్లీ లీటర్ల hashish ఆయిల్‌ను సీజ్ చేశారు. వీటితోపాటు ఒక హోండా యాక్టివా బైక్, మూడు మొబైల్ ఫోన్‌లనూ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 85 వేల ప్రాపర్టీని సీజ్ చేశారు.

మీర్‌పేట్ ఏరియాలో మాదకద్రవ్యాలను గుట్టుగా అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై మొత్తం ఏడుగురిపై మూడు కేసులు నమోదయ్యాయి. నలుగురిని arrest చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు.

Also Read: ఆవనూనె, నువ్వుల ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్... ముంబైలో 26 కేజీల హెరాయిన్ సీజ్

వరాల సంతోష్, రవ్వ ఫిలిప్స్ కళ్యాణ్‌లు గంజాయికి బానిస అయ్యారు. ఏ పనీ చేయకపోవడంతో డబ్బు ఆర్జనకు గంజాయిని అమ్మడమే పనిగా మొదలుపెట్టారు. 20 గ్రాముల గంజాయి ప్యాకెట్‌లను రూ. 50కు కొని రూ. 100కు అమ్మడం మొదలుపెట్టారు. ఇదేరీతిలో ఆటో డ్రైవర్ సయ్యద్ అజీజ్ కూడా అమ్మడం మొదలెట్టారు. గుర్రంగూడ ఆదిత్యనగర్‌లో నివసిస్తున్న బుర్సె నరేంద్ర శ్రీనివాస్ హశిశ్ ఆయిల్ అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. 2 ఎంఎల్‌ల 8 బాటిళ్ల హశిశ్ ఆయిల్‌ను కొన్నాడు. అందులో నాలుగు బాటిల్స్ అమ్మాడు.

ఈ మూడు కేసుల్లో వరాల సంతోశ్, రవ్వ ఫిలిప్స్ కళ్యాణ్, బుర్సె నరేంద్ర శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. శోభ, జిత్తు, నానిలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

click me!