కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

By narsimha lodeFirst Published Dec 21, 2018, 6:32 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖకు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలిపింది.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖకు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను  టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు బులెటిన్ విడుదల చేసింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన  కూచకుళ్ల దామోదర్ రెడ్డి,  ప్రభాకర్ రావు, సంతోష్‌కుమార్, ఆకుల లలితలు శుక్రవారం నాడు శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్‌కు  ఓ లేఖ ఇచ్చారు.మండలిలోని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తమను  టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని  కోరుతూ లేఖ ఇచ్చారు.

ఈ లేఖ విషయమై కాంగ్రెస్ పార్టీ  అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

తెలంగాణ పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీలు శుక్రవారం నాడు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు, గతంలో చోటు చేసుకొన్న ఘటనలపై స్వామిగౌడ్ న్యాయనిపుణులతో చర్చించారు. గత టర్మ్  అసెంబ్లీలో , శాసనమండలిలో టీడీపీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన ఘటనలను అధికారులు ప్రస్తావించారు.

దీంతో నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్‌‌ఎల్పీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు  శుక్రవారం నాడు   సాయంత్రం  శాసనమండలి సెక్రటరీ  బులెటిన్ విడుదల చేశారు.

టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ పార్టీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును  ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ పరిణామాలన్నీ  అప్రజాస్వామికమని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

‘‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

click me!