శీతాకాల విడిది కోసం హైద్రాబాద్‌కు చేరుకొన్న రాష్ట్రపతి కోవింద్

By narsimha lodeFirst Published Dec 21, 2018, 5:26 PM IST
Highlights

శీతాకా విడిది కోసం రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్  శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్‌కు చేరుకొన్నారు


హైదరాబాద్: శీతాకా విడిది కోసం రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్  శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.  మూడు రోజుల పాటు రాష్ట్రపతి హైద్రాబాద్‌లో ఉంటారు. రాష్ట్రపతి కోవింద్‌కు గవర్నర్  నరసింహాన్, తెలంగాణ సీఎం కేసీఆర్  ఘనంగా స్వాగతం పలికారు.

మూడు రోజుల పాటు  సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో  బస చేస్తారు. ప్రతి ఏటా శీతా కాల విడిది కోసం రాష్ట్రపతి వస్తారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రపతి కోవింద్ కుటుంబసభ్యులతో కలిసి హైద్రాబాద్‌కు వచ్చారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్రపతి కోవింద్  తిరిగి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.

రాష్ట్రపతి కోవింద్ ను కేసీఆర్ పలువురు అధికారులను, ప్రజా ప్రతినిధులను పరిచయం చేశారు. కోవింద్ ను ఆయన కారు వరకు కేసీఆర్ మాట్లాడుకొంటూ వెళ్లారు. రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

click me!