మీ వంతు అయిపోయింది...ఇక నా వంతే: హరీష్

By Arun Kumar PFirst Published Dec 21, 2018, 5:49 PM IST
Highlights

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తనకు ఘనవిజయం కట్టబెట్టిన సిద్దిపేట ప్రజలకు తానెప్పుడూ రుణపడి వుంటానని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భావోద్వేగంగా మాట్లాడారు. నియోజకవర్గ  ప్రజలే తన కుటుంబమని హరీష్ అన్నారు. తనను గెలిపించడంతో మీ వంతు అయిపోయిందని...ఇక ఈ ఐదేళ్లు మీ భాద్యత తీసుకకోవడం నా వంతని హరీష్ పేర్కొన్నారు.  
 

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తనకు ఘనవిజయం కట్టబెట్టిన సిద్దిపేట ప్రజలకు తానెప్పుడూ రుణపడి వుంటానని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భావోద్వేగంగా మాట్లాడారు. నియోజకవర్గ  ప్రజలే తన కుటుంబమని హరీష్ అన్నారు. తనను గెలిపించడంతో మీ వంతు అయిపోయిందని...ఇక ఈ ఐదేళ్లు మీ భాద్యత తీసుకకోవడం నా వంతని హరీష్ పేర్కొన్నారు.

 

ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలంలో హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఈ మండలంలో పోలైన ఓట్లలో 82 శాతం ఓట్లు టీఆర్ఎస్ కే వచ్చాయని గుర్తు చేశారు. ఇదే స్పూర్తితో రానున్న పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్ధానాలను ఏకగ్రీవం చేసుకుందామని సూచించారు. తన గెలుపుకు కృషి వారందరికి హరీష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 
   
సిద్దిపేట నియోజకవర్గంలో మంచి కార్యకర్తలతో పాటు మంచి ప్రజలున్నారని హరీష్ ప్రశంసించారు. ఒక్క పైసా ఇవ్వకపోయినా... ఒక్క మద్యం చుక్క పంచకపోయినా ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిన ప్రజలు గొప్పవారన్నారు. ఈ గెలుపు నాది కాదు సిద్దిపేట ప్రజలదేనని... ఇంత కంటే గొప్ప అనుభూతి మరొకటి లేదని హరీష్ భావోద్వేగంగా మాట్లాడారు. 

నిన్న(గురువారం) ఇబ్రహీంపూర్ గ్రామాన్ని చూడటానికి వివిధ రాష్ట్రాల నుండి ప్రజాప్రతినిధులు,అధికారుల వచ్చారని... వారు కూడా ఇలాగే అభివృద్ధి చేసుకుంటామని అన్నారని హరీష్ వెల్లడించారు. తాను చనిపోయే ముందు వదిలే చివరి శ్వాస వరకు మీకోసమే పని చేస్తానని అన్నారు.  

అతిత్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి చెరువు, ప్రతి కుంట నింపుతామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలోని ముఖ్య నాయకులు కూడా వేరే నియోజకవర్గాలకు ఈ ఎన్నికల్లో కృషి చేశారని గుర్తు చేశారు. ఓట్లప్పుడే కాదు... ప్రజల ప్రతి కష్టంలో, సుఖంలో తమ నాయకులు ఉంటారని...అందుకే ప్రజలకు తమపై నమ్మకం కుదిరిందన్నారు.


ఇటీవల ఎన్నికల్లో మెజారిటీ పెరిగింది కాబట్టి మన భాధ్యత కూడా మరింత పెరిగిందన్నారు. జనవరి నుండి గ్రామాల్లో పర్యటించి హామీలన్నీ అమలు చేద్దామని నాయకులకు సూచించారు.  మీకు ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయాలని... ప్రతి విషయానికి స్పందిస్తానని ధైర్యం చెప్పారు. అందరం కలిసి కట్టుగా ఉండి పచ్చని పల్లెలను తయారు చేసుకుందామని హరీష్ పిలుపునిచ్చారు.  
 

click me!