పరకాల నుండి బరిలోకి:కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న రేవూరి

By narsimha lode  |  First Published Oct 17, 2023, 10:30 AM IST

మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో  రేవూరి ప్రకాష్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.



వరంగల్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే  రేవూరి ప్రకాష్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.  ఈ నెల  18న  రాహుల్ గాంధీ సమక్షంలో రేవూరి ప్రకాష్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరనున్నారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరకాల నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది.

నర్సంపేట అసెంబ్లీ స్థానం నుండి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి టీడీపీ అభ్యర్ధిగా పలు దఫాలు ఆయన  ప్రాతినిథ్యం వహించారు.  గత ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి   రేవూరి ప్రకాష్ రెడ్డి  టీడీపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీని వీడి  బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. అయితే బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  రేవూరి ప్రకాష్ రెడ్డి  ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

Latest Videos

 ఈ నెల 15వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు రవి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు  రేవూరి ప్రకాష్ రెడ్డితో భేటీ అయ్యారు . కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. అదే రోజున మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో కూడ  రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.  కాంగ్రెస్ లో చేరాలని  రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.  మండవ వెంకటేశ్వరరావు  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

నర్సంపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా  ఉన్న తన అనుచరులతో చర్చించి నిర్ణయం చెబుతానని  రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు చెప్పారు. ఈ నెల  18న ములుగులో బస్సు యాత్రను  రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.దీంతో రాహుల్ గాంధీ సమక్షంలో  రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

నర్సంపేట అసెంబ్లీ స్థానంలో  సీపీఎం నుండి, ఎంసీపీఐ నుండి పలు దఫాలు  అసెంబ్లీలో అడుగుపెట్టిన  మద్దికాయల ఓంకార్ ను  ఓడించి  అసెంబ్లీలో అడుగుపెట్టారు  రేవూరి ప్రకాష్ రెడ్డి .  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  పీఏసీ చైర్మెన్ గా కూడ  ఆయన  పనిచేసిన విషయం తెలిసిందే.

also read:టీజేఎస్‌తో కాంగ్రెస్ పొత్తు చర్చలు: అభ్యర్థుల ప్రకటనపై కోదండరామ్ అసంతృప్తి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న బండి సంజయ్ ను తప్పించడాన్ని  రేవూరి ప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు .దీంతో  తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని  రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రేవూరి ప్రకాష్ రెడ్డి  ఈ వ్యాఖ్యలు చేశారు.
 

click me!