Konijeti Rosaiah Death: రేపు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు భౌతికకాయం..

By team teluguFirst Published Dec 4, 2021, 10:26 AM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Konijeti rosaiah funeral) ఆదివారం (డిసెంబర్ 5) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లో మహాప్రస్తానంలో జరగనున్నట్టుగా కేవీపీ రామచంద్రరావు తెలిపారు. 
 

రాజకీయ కురవృద్దుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువరు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు స్టార్ ఆస్పత్రికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు.. తనకకు రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇది తనకు తీరని లోటని, జీవితంలో పెద్ద దిక్కును కోల్పోయానని చెప్పారు. తనకు రోశయ్య పెద్ద అన్నయ్య లాంటివారని అన్నారు. వైఎస్సార్ కూడా రోశయ్య వద్ద నుంచి అనేక అంశాలు నేర్చుకున్నారని తెలిపారు. ఆర్థిక విధానాల్లో పూర్తి క్రమశిక్షణ ఎంత అవసరమో రోశయ్య బోధించారని అన్నారు. రోశయ్య సమర్ధవంతగా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారని అన్నారు.

రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు.. 
రోశయ్య అంత్యక్రియలు (Konijeti rosaiah funeral) ఆదివారం (డిసెంబర్ 5) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లో మహాప్రస్తానంలో జరగనున్నట్టుగా కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం స్టార్ ఆస్పత్రిలో ఉందని.. వైద్య ప్రక్రియ అనంతరం అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించనున్నట్టుగా చెప్పారు. రేపు ఉదయం ఆయన ఇంట్లో తుది పూజలు చేసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు తరలించనున్నట్టుగా చెప్పారు. 

Also read: Konijeti Rosaiah Death: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నట్టుగా చెప్పారు. అనంతరం గాంధీ భవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి  గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో రోశయ్య అంత్యక్రియలు (Konijeti rosaiah Last rites) నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 

రోశయ్య కన్నుమూత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలుమురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశ‌య్య.. రాజకీయ ప్రస్థానం..

గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్నారు. రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, టీ అంజయ్య, కె విజయభాస్కర రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి  మత్రివర్గాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

click me!