ఔటర్ పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. మంటల్లో దగ్థం...

By SumaBala BukkaFirst Published Dec 4, 2021, 9:49 AM IST
Highlights

ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. సమాచారం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న హయత్ నగర్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంకాగా, లారీ పాక్షికంగా దగ్ధం అయింది. అటుగా వెళ్తున్న వాహన దారుడు కార్ లో మంటలను చూసి డ్రైవర్ ను బయటకి తీయడంతో ప్రమాదం తప్పింది. 

పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో మంటలు చెలరేగి కారు, లారీ దగ్ధమయ్యాయి. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం. శంషాబాద్ నుండి ఘట్కేసర్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. సమాచారం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న హయత్ నగర్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంకాగా, లారీ పాక్షికంగా దగ్ధం అయింది. అటుగా వెళ్తున్న వాహన దారుడు కార్ లో మంటలను చూసి డ్రైవర్ ను బయటకి తీయడంతో ప్రమాదం తప్పింది. 

ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ ను ఈ.సి.ఐ.ఎల్ దమ్మాయిగూడా కి చెందిన మయూర్ గా పోలీసులు  గుర్తించారు.

ప్రేమపేరుతో యువతి వెంటపడి.. గదికెళ్లి పలుమార్లు లైంగికదాడి చేసి, పెళ్లి పేరెత్తగానే...

ఇదిలా ఉండగా.. గత నెల నవంబర్ 29న తెలంగాణ వ్యక్తి ఒకరు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. మరి కొద్ది రోజుల్లో ఇంటికి రావాల్సిన ఆ యువకుడు.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.  సూర్యాపేట పట్టణంలోని నల్లాలబావి కాలనీకి చెందిన నరేంద్రుని లింగమూర్తి, సధారాణిల కుమారుడు చిరుసాయి (22) పై చదువుల కోసం 11 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. వచ్చే నెల 15 వ తేదీన సాయి ఇండియాకు రావాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో అమెరికాలో షాపింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సాయికి యాక్సిడెంట్ అయింది. భారీగా మంచు కురుస్తున్న సమయంలో సాయి డ్రైవ్ చేస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడిక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న నల్లగొండకు చెందిన మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది.

చనిపోయిన సాయి మృతదేహాన్నీ ఇండియా కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఒక్కగానొక్క కొడుకు మరో 15రోజులలో సూర్యాపేటకు రావాల్సి ఉండగా, రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాయి మృతి వార్తతో సూర్యాపేట పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

click me!