Konijeti Rosaiah Death: కొణిజేటి రోశయ్య మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం.. పలు పదవులకు వన్నె తెచ్చారని వ్యాఖ్య

By team teluguFirst Published Dec 4, 2021, 9:59 AM IST
Highlights

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోశయ్య మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు పదవులకు కొణిజేటి రోశయ్య వన్నె తెచ్చారని కేసీఆర్ అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని ప్రదర్శించారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రస్తుతం రోశయ్య భౌతికకాయం స్టార్ ఆస్పత్రిలో ఉంచారు ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు స్టార్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. వైద్య ప్రక్రియలను పూర్తయిన తర్వాత అమీర్‌పేటలోని ఆయన నివాసాని తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్తానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

Also read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశ‌య్య.. రాజకీయ ప్రస్థానం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలుమురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also read: Konijeti Rosaiah Death: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్నారు. రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, టీ అంజయ్య, కె విజయభాస్కర రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి  మత్రివర్గాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

click me!