జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ల పోలీస్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. కస్టడీ ముగిసిన తర్వాత ఐదుగురు మైనర్లను పోలీసులు జువైనల్ హోంకి తరలించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే ఉన్నారు. ఈ ఐదుగురు మైనర్లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ పోలీస్ కస్టడీ ముగిసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: Hyderabad జూబ్లీహిల్స్ Gang Rape కేసులో ఐదుగురు మైనర్ల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ఇప్పటికే ముగిసింది. SaadUddin Malik తో పాటు Minors తమ విచారణలో చెప్పిన అంశాలను పోలీసులు సరి చూసుకుంటున్నారు. ఈ కేసులోని ఆరుగురు నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరించే పనిలో ఉన్నారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితులు చెప్పిన విషయాలు సరిపోలుతున్నాయా లేదా అనే విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Amnesia పబ్ లో ఇద్దరు మైనర్ బాలికలను నిందితులు టార్గెట్ చేశారు. అయితే ఒక మైనర్ బాలిక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయింది. ఇంటి వద్ద దింపుతామని మైనర్ బాలికను నమ్మించిన నిందితులు కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే కావడం గమనార్హం,. వీరిలో ప్రజా ప్రతినిధులకు చెందిన పిల్లలు కావడం కలకలం రేపుతుంది. ఈ ఘటనపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.
undefined
ఈ కేసులో తొలుత ముగ్గురు మైనర్లను ఆ తర్వాత మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురు మైనర్లను జువైనల్ హోంలో ఉంచారు. ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను తిరిగి చంచల్ గూడ జైల్లోకి పోలీసులు తరలించారు. జువైనల్ హోంలో తొలి రోజు ముగ్గురు నిందితులను పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఆలస్యంగా అరెస్టైన మరో ఇద్దరు నిందితులకు కూడా పోలీస్ కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతిని ఇచ్చింది. దీంతో ఈ ఐదుగురిని పోలీసుల బృందం విచారించింది. ఈ కేసును విచారిస్తున్న ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలోని బృందం నిందితులను వేర్వేరుగాను అందరిని కలిసి విచారించారు. అంతేకాదు నిందితులతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కూడా చేయించారు.
ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సీరీస్ లు చూసి తాము ఈ దారుణానికి పాల్పడినట్టుగా నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్టుగా మీడియా కథనాలు చెబుతున్నాయి. నిందితులు ఉపయోగించిన రెండు కార్లలో కూడా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారని కూడా ప్రసారసాధనాలు రిపోర్టు చేశాయి. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇన్నోవా కారును వారం రోజుల తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మెయినాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో ఉన్న ఈ కారును స్వాధీనం చేసుకొన్నామని పోలీసులు ప్రకటించారు.
ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.
కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.