హైదరాబాద్ : ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఇతర షాపులకు వ్యాపిస్తోన్న మంటలు, పక్కనే పెట్రోల్ బంక్

Siva Kodati |  
Published : Jul 30, 2022, 03:22 PM IST
హైదరాబాద్ : ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఇతర షాపులకు వ్యాపిస్తోన్న మంటలు, పక్కనే పెట్రోల్ బంక్

సారాంశం

హైదరాబాద్ ఓంకార్ నగర్‌లోని ఏషియన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు మూడో గోదాంలోకి కూడా వ్యాపిస్తూ వుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు

హైదరాబాద్ (hyderabad) ఓంకార్ నగర్‌లోని ఏషియన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. మంటలు గోదాం పక్కనే వున్న ఎన్. ఇంటీరియర్ ఫర్నీచర్ గోదాములోకి వ్యాపించాయి. రెండు గోదాముల్లోనూ అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక ఫైరింజిన్‌తో మంటలు ఆర్పడం సాధ్యం కాకపోవడంతో మరో ఫైరింజిన్‌ను రప్పిస్తున్నారు. 

ALso REad:విజయవాడ: హ్యుండాయ్ సర్వీస్ సెంటర్‌లో పేలిన కార్లు.. పరుగులు తీసిన ఉద్యోగులు

మంటలు మూడో గోదాంలోకి కూడా వ్యాపిస్తూ వుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ధర్మోకాల్ కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని ఫర్నిచర్ గోదాం మేనేజర్ ఆరోపిస్తున్నారు. సమయానికి ఫైరింజన్ రాకపోవడం కూడా భారీ నష్టానికి కారణమైందని .. కోట్ల రూపాయాలు నష్టపోయామని వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉదయం 11 గంటలకు అగ్నిప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బంక్ కూడా వుండటంతో అధికారులు , స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే