మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడటంతో తెలంగాణకు చెందిన నలుగురు సోదరులు మృతి

Published : May 24, 2023, 12:04 PM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడటంతో తెలంగాణకు చెందిన నలుగురు సోదరులు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడటంతో సిద్ధిపేటలోని చౌటపల్లికి చెందిన నలుగురు సోదరులు అక్కడికక్కడే మరణించారు. ఈ మరణవార్త  తెలియడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు సోదరులు మరణించారు. వీరంతా సిద్ధిపేట జిల్లా చౌటపల్లికి చెందినవారు. ఈ ప్రమాదం ఔరంగాబాద్ లో మంగళవారం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

వంట మనిషి కుమారుడు కలెక్టర్ కాబోతున్నారు.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన పేదింటి బిడ్డ రేవయ్య..

ఈ ఘటనకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి కొన్ని సంవత్సరాల కిందట గుజరాత్ లోని సూరత్ కు జీవనోపాధి కోసం వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ పలు శుభకార్యాలకు, పండగల సమయంలో స్వగ్రామానికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో వీరికి బంధువైన ఎరుకల రాములు ఐదు రోజుల కిందట చౌటపల్లిలో మరణించారు. అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆ నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు స్వగ్రామానికి చేరుకున్నాయి.

దారుణం.. ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఘటన

ఆ కుటుంబ సభ్యులంతా మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తరువాత జరగాల్సిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆ నలుగురు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులు చౌటపల్లిలోనే ఉంచి సూరత్ కు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారమే వారు నలుగురు సోదరులు మంగళవారం కారులో గుజరాత్ కు ప్రయాణం ప్రారంభించారు. ఆ కారు ఆ రోజు రాత్రి సమయానికి మహారాష్ట్రలోని ఔరంగబాద్ చేరుకుంది.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు చేయగా లేనిది.. ఇప్పుడు మోడీ చేస్తే తప్పా - కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

ఈ క్రమంలో ఆ కారు అదుపుతప్పడంతో బోల్తా పడింది. పలుమార్లు పల్టీలు కొట్టడంతో ఆ కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఒకే సారి కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. 

PREV
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??