షెల్ కంపెనీల నుండి మారిషస్ కు రూ. 75 కోట్లు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సుఖేష్ ఆరోపణలు

By narsimha lodeFirst Published May 24, 2023, 11:54 AM IST
Highlights

తీహార్ జైలులో  ఉన్న సుఖేష్ చంద్రశేఖర్  ఇవాళ  మరో లేఖను  విడుదల  చేశారు. ఈ లేఖలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  పై ఆరోపణలు  చేశా

న్యూఢిల్లీ:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై    మరోసారి  సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు  చేశారు. ఈ మేరకు  బుధవారంనాడు  జైలు నుండి లేఖను విడుదల  చేశారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  షెల్ అకౌంట్ల నుండి  మారిషస్ అకౌంట్లకు  నగదును పంపినట్టుగా   ఆ లేఖలో  సుఖేష్ చంద్రశేఖర్   ఆరోపించారు.  రూ. 75 కోట్లను  ఈ ఖాతాల నుండి పంపినట్టుగా  సుఖేష్  చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఈ నగదును క్రిప్టో కరెన్సీగా  మార్చినట్టుగా సుఖేష్  ఆ లేఖలో  తెలిపారు.

మూడు దఫాలుగా  రూ. 75 కోట్లను  పంపినట్టుగా  సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించారు.  సుఖేష్ చంద్రశేఖర్ తన  అడ్వకేట్  ద్వారా ఈ లేఖను  మీడియాకు విడుదల చేశారు.  ఐదు పేజీల  లేఖలో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై  ఆయన ఆరోపణలు  చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని  ఫర్నీచర్ కు  చేసిన ఖర్చును తాను భరించినట్టుగా  సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయాలను  తాను బయటపెట్టినందుకుగాను  తనను జైలులో  ఇబ్బందులు పెడుతున్నారని  సుఖేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో ఆరోపించారు. 

గతంలో  కూడా  సుఖేష్ చంద్రశేఖర్   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితపై  ఆరోపణలు  చేశారు. కవితతో తాను వాట్సాప్ చాటింగ్  చేసినట్టుగా  పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను  కూడా  ఆయన మీడియాకు విడుదల  చేశారు.  అయితే సుఖేస్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఖండించారు.  తనను రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు  తప్పుడు  ప్రచారం  చేస్తున్నారని  ఆమె  మండిపడ్డారు.తీహార్ జైలులో  ఉన్న  సుఖేష్ చంద్రశేఖర్  గతంలో ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,   ఆప్ నేతలను లక్ష్యంగా ఆరోపణలు  చేసిన విషయం తెలిసిందే. 

ఆప్ కీలక నేతల సూచన మేరకు  బీఆర్ఎస్ నేతలకు  డబ్బులను  సమకూర్చినట్టుగా  గతంలో   వాట్సాప్ చాటింగ్  విడుదల చేసిన సమయంలో   సుఖేష్ చంద్రశేఖర్  ఆరోపణలు  చేశారు.   ఈ ఆరోపణలను  బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. రాజకీయ దురుద్దేశంతోనే  ఈ ఆరోపణలు  చేశారని  ఆ పార్టీ  నేతలు  వివరించారు.  సుఖేష్  చంద్రశేఖర్ ఆరోపణలను  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   తోసిపుచ్చారు.

click me!