కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్లు.. తీవ్ర నొప్పితో మహిళ మృతి

Published : Aug 23, 2023, 12:38 PM IST
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్లు.. తీవ్ర నొప్పితో మహిళ మృతి

సారాంశం

బాలింత కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. కడుపులోనే దూది ఉంచి, కుట్లు వేసేశారు. దీంతో వారం రోజుల తరువాత ఆమెకు తీవ్ర నొప్పి కలిగింది. ముందుగా ఆపరేషన్ చేసిన ఆ హాస్పిటల్ కు, తరువాత మరో రెండు హాస్పిటల్స్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తీవ్ర అస్వస్థతతో ఆమె మరణించింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.   

వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల పోయేలా చేసింది. ప్రసవం చేయించుకునేందుకు హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీకి డాక్టర్లు సిజేరియన్ చేశారు. మగ బిడ్డ జన్మించాడు. అనంతరం డాక్టర్లు ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేశారు. అయితే పొరపాటున కడుపులోనే దూది ఉంచి, దానిని తొలగించడం మర్చిపోయారు. తరువాత కుట్లు వేశారు. వారం రోజుల తరువాత ఆ బాలింత తీవ్ర నొప్పితో మరణించింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. 

ఢిల్లీ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. మత్తు మందు ఇచ్చి మొదటి సారి అఘాయిత్యం..

‘ఈనాడు’ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దర్శన్ తాండాకు చెందిన రోజా అనే గర్భిణికి పొద్దులు నిండాయి. పురిటి నొప్పులు రావడంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అచ్చంపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు ఈ నెల 15వ తేదీన వెళ్లింది. ఆమెను పరీక్షించి, అడ్మిట్ చేసుకున్నారు. అదే రోజు ఆమెకు సిజేరియన్ చేయడంతో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా.. అదే రోజు ఆమెకు డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేష్ కూడా చేశారు. కానీ పొరపాటున కడుపులో దూది ఉంచారు. దానిని తీయడం మర్చిపోయారు. తరువాత అలాగే కుట్లు వేసేశారు. అనంతరం బాలింతను డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపిచారు.

చంద్రయాన్-3 విజయం సాధించాలని ముస్లింల ప్రార్థనలు.. లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో నమాజ్

అయితే వారం రోజుల వరకు బాగానే ఉన్న బాలింతకు తరువాత రక్తస్రావం కావడం మొదలుపెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే మంగళవారం ఆమెను ప్రసవం జరిగిన అదే గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అయితే డాక్టర్లు ఆమెను పరీక్షించారు. సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకొని వెళ్లాలని సూచించారు. అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వెంటనే హైదరాబాద్ కు తీసుకొని వెళ్లాలని సూచించారు. 

చంద్రయాన్-3 సురక్షితంగా దిగుతుంది.. భారత్ తప్పకుండా సంబరాలు జరుపుకుంటుంది - వింగ్ కమాండర్ రాకేష్ శర్మ

దీంతో కుటుంబ సభ్యులు బాలింతను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆమె అడ్మిట్ అయ్యింది. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి, అదే రోజు రాత్రి సమయంలో మరణించింది. దీంతో డెడ్ బాడీని కుటుంబ సభ్యులు బుధవారం అచ్చంపేటకు తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?