మెదక్ లో ఉద్రిక్తత... సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం

Published : Aug 23, 2023, 12:14 PM ISTUpdated : Aug 23, 2023, 12:26 PM IST
మెదక్ లో ఉద్రిక్తత... సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మెదక్ జిల్లా పర్యటనను అడ్డుకోడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం భారీ బైక్ ర్యాలీకి సిద్దమవగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకోడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్దమవడంతో మెదక్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయంతో పాటు బిఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే సీఎం పర్యటనను అడ్డుకోడానికి కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీకి సిద్దమయ్యారు. 

గత ఎన్నికల సమయంలో మెదక్ కు వచ్చిన కేసీఆర్ అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారని... మళ్లీ ఎన్నికలు వచ్చినా ఇప్పటివరకు ఏ హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతంలో  హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కేసీఆర్ మెదక్ గడ్డపై అడుగుపెడుతున్నాడని... అతడిని పదివేల మందితో అడ్డుకుంటామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

Read More  KCR: మెదక్‌లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయ‌నున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకోడానికి డిసిసి అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీకి సిద్దమయ్యారు. పోలీసులు ఈ బైక్ ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించి కార్యకర్తలను చెదరగొట్టారు. 

అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక్క‌డి నుంచి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సభ సజావుగా జరిగేలా చూడాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్నారు. 

ఇప్పటికే మెదక్ స‌భ ఏర్పాట్ల‌ను బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో సీఎం బహిరంగ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?