ఈ లేడీ మహా కిలాడీ... ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంగానే ఘరానా మోసాలు

By Arun Kumar P  |  First Published Jun 15, 2023, 10:31 AM IST

ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంగానే మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీస్ కానిస్టేబుల్ ను టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. 


హైదరాబాద్ : ఎవరయినా మోసపోతే ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకు వెళుతుంటారు... కానీ పోలీస్ కమీషనర్ కార్యాలయం కేంద్రంగానే మోసాలు జరిగితే ఏంటి పరిస్థితి. ఇలాంటి ఘరానా మోసమే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగుచూసింది. నకిలీ ఐడీ కార్డుతో పోలీస్ కానిస్టేబుల్ గా నమ్మించి అమాయక యువతను ఉద్యోగాల పేరిట మోసం చేస్తోంది ఓ మహిళ. ఈ మోసాలకు ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయాన్నే వాడుకుంటోంది కిలేడీ. ఇలా ఇప్పటికే అనేకమంది యువకులను మోసంచేసిన మహిళను ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ లో నివాసముంటున్న ఓ యువతి మోసాలనే ప్రవృత్తిగా మార్చుకుంది. తన పేరును అశ్విని రెడ్డిగా మార్చుకుని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నట్లుగా నకిలీ ఐడి కార్డు సృష్టించింది. హైదరాబాద్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని నమ్మించి ఉద్యోగాల పేరిట మోసాలకు తెరతీసింది. 

Latest Videos

బషీర్ బాగ్ లోని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయానికి ర్యాపిడో బైక్ ను ఎంచుకునేది అశ్విని రెడ్డి. బైక్ నడిపే యువకుడితో మాటలు కలిపి పరిచయం చేసుకునేది. తనకు కమీషనర్ కార్యాలయంలో మంచి పరిచయాలు వున్నాయని... కావాలంటే పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేంది. అయితే ఉద్యోగం కోసం కొంత డబ్బు చెల్లించాలని సూచించేది. ఇలా ఆమె మాటలు నమ్మి చాలామంది యువకులు వేలాది రూపాయలు ఇచ్చి మోసపోయారు. 

Read More  బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం..హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి జారిపడి విద్యార్థిని మృతి..

ర్యాపిడో బైక్ పై సిపి కార్యాలయం వద్దకు వెళ్లి లోపలికి వెళ్లి ఉద్యోగం గురించి మాట్లాడి వస్తానని చెప్పి యువకులను బయటే వుంచేది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి పని అయిపోయిందనో లేక సమయం పడుతుందనో చెప్పేది. ఆ తర్వాత యువకులతో టచ్ లో వుంటూ డబ్బులు వసూలు చేసేది. ఇలా ఉద్యోగాల పేరిట నమ్మించి మోసం చేసిన డబ్బుతో ఈ నకిలీ పోలీస్ జల్సాలు చేసుకునేది. 

హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఘరానా మోసంపై పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ కానిస్టేబుల్ ను పట్టుకుని పోలీస్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించగా ఉద్యోగాల పేరిటే కాదు పెళ్లిళ్ల పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. 

గతంలో ఈసిఐఎల్ ప్రాంతానికి చెందిన రోహిత్ కిషోర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అశ్విని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగింది. ప్రస్తుతం మెహదీపట్నంలో వుంటూ అభిషేక్ అనే యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలా భర్తతో సహా మిగతా ఇద్దరు ప్రియులతో అశ్విని బలవంతంగా దొంగతనాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

click me!