హైద్రాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుండి బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఇళ్లలో సోదాలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో ఐటీ సోదాలు గురువారంనాడు కొనసాగుతున్నాయి. నిన్నటి నుండి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో సోదాలు సాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో నిన్న ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒడిశా , ఢిల్లీకి చెందిన ఐటీ అధికారుల బృందం సోదాలు చేస్తుంది.
పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. 70 ఐటీ అధికారుల బృందం సోదాలు చేస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా రెడ్డిని ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారని సమాచారం. పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన వ్యాపారాలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. శేఖర్ రెడ్డి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టుబుడి పెట్టినట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై ఆరా తీస్తున్నారు.
undefined
మరో వైపు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన వస్త్ర దుకాణాలతో పాటు ఆయన నివాసంలో కూడ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మర్రి జనార్ధన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ పేరుతో వస్త్ర దుకాణం ఉంది. దీంతో పాటు పలు వస్త్రాల దుకాణాలు కూడ ఆయనకు ఉన్నట్టుగా సమాచారం.
జేసీ బ్రదర్స్ కు చెందిన అమీర్ కార్పోరేట్ ఆఫీస్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జేపీ స్పిన్నింగ్ మిల్స్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ , మర్రి ప్రాజెక్టు లిమిటెడ్ పేరుతో మర్రి జనార్ధన్ రెడ్డికి వ్యాపారాలు న్నాయని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు..ఈ విషయమై ఆరా తీస్తున్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో కూడ నిన్న ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి వ్యాపారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. తన వ్యాపారాలన్నీ తెల్లకాగితం వంటివని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
also read:విదేశాల్లో నేను పెట్టుబడులు పెట్టలేదు: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
నాగర్ కర్నూల్ , భువనగిరి ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డిలకు చెందిన అనుచరులు ఐటీ తనిఖీలపై మండిపడ్డారు. బీజేపీ ఆదేశాల మేరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.