బాసర ట్రిపుల్ ఐటీలో లిఖిత మృతితో ఉద్రిక్తత నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీ భవనం ముందు రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు.
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో గురువారంనాడు తెల్లవారుజామున లిఖిత అనే విద్యార్ధిని మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల వ్యవధిలోనే దీపిక, లిఖితలు బాసర ట్రిపుల్ ఐటీ లో మృతి చెందడం కలకలం రేపుతుంది.
బాసర ట్రిపుల్ ఐటీకి ఇవాళ ఉదయం లిఖిత పేరేంట్స్, బంధువులు చేరుకున్నారు. లిఖిత ఎలా చనిపోయిందని బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బందిని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ గేటు ముందు పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు నిర్మల్ ఆసుపత్రి వద్ద బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకటరమణ కారును విపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డగించాయి. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రెండు రోజుల వ్యవధిలో దీపిక, లిఖితలు మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది విద్యార్ధులు చనిపోతే చర్యలు తీసుకుంటారని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకటరమణ ను విపక్షపార్టీల నేతలు ప్రశ్నించారు. లిఖిత మృతి చెందిన విషయాన్ని పేరేంట్స్ కు ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బారసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు.
వదంతులు నమ్మొద్దు; బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకటరమణ
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందడం దురదృష్టకరమని ఇంచార్జీ వీసీ వెంకటరమణ చెప్పారు.బాసర ట్రిపుల్ ఐటీ ఏదో జరుగుతుందనే వదంతులను నమ్మొద్దని వీసీ వెంకటరమణ చెప్పారు. బాగా చదువుకునే ఇద్దరు విద్యార్ధులు చనిపోవడం బాధాకరమని వీసీ వెంకటరమణ తెలిపారు. లిఖిత ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడి మృతి చెందిందని ఆయన చెప్పారు. విద్యార్ధుల సర్టిఫికెట్లను దగ్దం చేశారనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు పోలేదన్నారు.
also read:బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం..హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి జారిపడి విద్యార్థిని మృతి..
రెండు రోజుల క్రితం దీపిక అనే విద్యార్ధిని వాష్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది. లిఖిత ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడి చనిపోయిందని వీసీ చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీ లోని బాలికల వసతి గృహంలోని గంగా భవనం నుండి లిఖిత నాలుగో అంతస్తు నుండి పడిపోయింది. లిఖిత స్వగ్రామం సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం