‘‘ నాతో శృంగారం చేస్తే ... నా శక్తులన్నీ మీలో ప్రవేశిస్తాయి’’ : మహిళల్ని ట్రాప్, 11 మందితో దొంగ బాబా రాసలీలలు

By Siva Kodati  |  First Published Aug 3, 2021, 5:27 PM IST

మనుషుల బలహీనతలు, అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు రోజుకొకటి  వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ బురిడీ బాబా 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. 


నల్గొండలో బురిడీ బాబా విశ్వచైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బాబాకు 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు మీకూ వస్తాయని మహిళలను విశ్వచైతన్య నమ్మించాడని తేలింది. మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి వీడియో కాల్స్ చేసేవాడని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. బురిడీ బాబా నుంచి రూ.26 లక్షల నగదు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతని రెండో భార్య సుజితపైనా రూ.1.30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నట్లు ఎస్పీ తెలిపారు. 

సదరు దొంగబాబా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా.. అని నమ్మబలికాడు. అయితే ఓ మహిళ ఫిర్యాదుతో దొంగ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్‌ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు వసూలు చేశాడు.

Latest Videos

undefined

Also Read:బాబా అవతారమెత్తిన బీటెక్ గ్రాడ్యుయేట్: భారీగా ఆశ్రమం... దొంగ పూజలతో కోట్లల్లో సంపాదన

అయితే ఇటీవల తన సమస్యను తొలగిస్తానని సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్‌ బాండ్లు, లాప్‌టాప్‌లు, ప్రవచన పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా బురిడీ బాబా.. సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు..

click me!