కరోనా రహిత గ్రామంగా సిరిసిల్ల జిల్లా రాజన్నపేట... ప్రాజెక్ట్ మదద్ కృషి ఫలితమే (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 3, 2021, 3:45 PM IST
Highlights

ప్రాజెక్ట్ మదద్ పేరుతో తెలంగాణలోని ఓ గ్రామం మొత్తాన్ని కరోనా రహిత గ్రామంగా మార్చడానికి కొందరు యువతీ యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సిరిసిల్ల జిల్లాలోని రాజన్నపేట గ్రామస్తులందరికి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. 

సిరిసిల్ల: కరోనా కట్టడికి భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసింది. అలాంటిది తెలంగాణలోకి ఓ గ్రామం ఈ వ్యాక్సినేషన్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచేందుకు సిద్దమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజన్నపేట గ్రామాన్ని సంపూర్ణ వ్యాక్సినేషన్ గ్రామంగా మార్చేందుకు 'ప్రాజెక్టు మదద్ ' అనే స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. ఆ దిశగా చర్యలను కూడా ప్రారంభించింది. 

బెంగుళూరు, హైదరాబాదు, అమెరికాలో ఉద్యోగాల్లో స్థిరపడ్డ కొంతమంది యువతీ యువకులు ''ప్రాజెక్టు మదద్''' (చేయూత) పేరుతో గత ఏప్రిల్ నుంచి తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రజలకు కోవిడ్ కు సంబంచిన విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఇందుకోసం ఈ స్వచ్చంద సంస్థ అమెరికాలో స్థిరపడిన తెలుగురాష్ట్రాలకు చెందిన 16 మంది వైద్య నిపుణుల సాయంతో తెలంగాణ గ్రామాల్లోని వైద్య సదుపాయాలను మెరుగుపర్చే ప్రయత్నం చేస్తున్నారు. 

వీడియోలు

తాజాగా ఈ ప్రాజెక్ట్ మదద్ సంస్థ సిరిసిల్ల జిల్లాలలోని రాజన్నపేటను దేశానికే ఆదర్శంగా నిలిచేలా పూర్తిగా వాక్సినేటెడ్ గ్రామంగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ గ్రామంలో గల రెండువేలకు పైగా  జనాభా మొత్తానికి ఉచిత వాక్సిన్ అందించే ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఒక్క ఈ గ్రామంలోనే కాదు ఈ గ్రామానికి నిత్యం రాకపోకలు సాగించే అల్మాస్ పేటలో కూడా సంపూర్ణ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మేం  చేసిన ప్రయోగాలు, వాటి సత్ఫలితాల గురించి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని మదద్ ప్రధాన సారథి రాజా కార్తికేయ (న్యూయార్క్)  పేర్కొన్నారు.  

"రాజన్నపేట గ్రామాన్ని పూర్తి వాక్సినేటెడ్ గ్రామంగా చేయటానికి మాకు తగిన మార్గదర్శనం, చేయూత అందించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్, అవసరమైన సహాయ సహకారాల్ని అందించిన జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, గ్రామస్థులందర్నీ ఒప్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన సర్పంచ్ శంకర్ కి  మా హృదయపూర్వక ధన్యవాదాలు. మండల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాయక్, రాజన్నపేట ఎ.ఎన్.ఎం రాజేశ్వరి సహా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎ.ఎన్.ఎం లందరికీ ధన్యవాదాలు" అన్నారు ఇండియాలో ప్రాజెక్టు సారథి బలరాం.  

click me!